విక్రమ్‌కు హార్ట్ స్ట్రోక్ రాలే, ఛాతీలో నొప్పి, నిలకడగానే ఆరోగ్యం: బులెటిన్‌లో కావేరి ఆస్పత్రి
చియాన్ విక్రమ్‌కు గుండె పోటు వచ్చిందనే వార్త ఒక్కసారిగా కలకలం రేగింది. ఆయనను వెంటనే కావేరి ఆస్పత్రిలో చేర్చారు. విక్రమ్‌కు గుండెపోటు రాలేదని.. ఆయన మేనేజర్ ఇదివరకే చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కావేరి ఆస్పత్రి యాజమాన్యం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఛాతీలో అసౌకర్యం వల్లే ఆసుపత్రిలో చేరారని తెలిపారు.
ఛాతీలో అసౌకర్యంగా ఉండడంతో విక్రమ్ తమ ఆసుపత్రిలో చేరారని కావేరి ఆస్పత్రి వెల్లడించింది. విక్రమ్‌ను నిపుణులైన వైద్యుల బృందం పరీక్షించిందని, అవసరమైన వైద్యం అందిస్తోందని తెలిపింది. విక్రమ్‌కు కార్డియాక్ అరెస్ట్ లక్షణాలేవీ లేవని, అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వివరించింది. త్వరలో డిశ్చార్జి చేస్తామని కావేరీ ఆసుపత్రి తన ప్రకటనలో తెలిపింది.

విక్రమ అనారోగ్యం గురించి తెలిసి అభిమానులు అల్లాడిపోయారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. అయితే సినీ విమర్శకుడు రమేష్ బాలా మాత్రం.. హై ఫీవర్ వల్ల విక్రమ్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారని విక్రమ్ సన్నిహితులు తనకు చెప్పినట్టు తన ట్విట్ చేశారు. అసలు విక్రమ్ హఠాత్తుగా అనారోగ్యం పాలు కావడానికి కారణాలు ఏంటి అనే విషయమై ఇపుడు అందరు ఆరా తీస్తున్నారు.

విక్రమ్ గత కొన్ని రోజులుగా మణి రత్నం దర్శకత్వంలో 'పొన్నియన్ సెల్వన్' అనే చారిత్రక సినిమా చేస్తున్నారు. మూవీలో అందమైన శరీర సౌష్ఠవం కోసం ఏజ్‌ను లెక్క చేయకుండా చేసిన వ్యాయామాల వల్ల ఆయన తీవ్ర అస్వస్థతతకు గురయ్యారని సమాచారం. ఇవాళ ఆ మూవీ టీజర్ కూడా రిలీజ్ కావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications