జారిన హెలికాప్టర్: మహారాష్ట్ర సీఎంకు తప్పిన ప్రమాదం

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రాయగఢ్ జిల్లాలో శుక్రవారం ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా కుదుపులకు లోనైంది. నేల తడిగా ఉండటంతో ల్యాండ్ అయిన వెంటనే హెలికాప్టర్ జారిపోయిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

తొలుత పైలట్ కొద్ది సెకన్లపాటు నియంత్రణ కోల్పోయిన వెంటనే సురక్షితంగా హెలికాప్టర్‌ను దింపడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ సమయంలో ఫడ్నవీస్ తోపాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు, ఓ ఇంజినీరు, పైలట్, కో-పైలట్ హెలికాప్టర్‌లో ఉన్నారు.

 Chopper carrying CM Devendra Fadnavis skids while landing in Raigarh

పెద్ద ప్రమాదం నుంచి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సహా అంతా క్షేమంగా బయటపడ్డారని జిల్లా ఎస్పీ అనిల్ పరాస్కర్ తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహా జనాదేశ్ సంకల్ప్ సభలో పాల్గొనేందుకు ఫడ్నవీస్ రాయగఢ్ వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

2017లోనూ ఫడ్నవీస్‌ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ లాథూర్‌లో క్రాష్‌ ల్యాండింగ్‌ అయిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదం నుంచి సీఎం క్షేమంగా బయటపడ్డారు. హెలికాప్టర్ మొత్తం దెబ్బతిన్నా సీఎం ఫడ్నవీస్ మాత్రం క్షేమంగా బయటపడ్డారు. హెలికాప్టర్ నుంచి స్థానికులు సీఎంను సురక్షితంగా బయటికి తీసుకురావడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+