వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ బరితెగింపు: రైతులపై దాడి -ఢిల్లీ సరిహద్దులో టెన్షన్ -తోలు ఒలుస్తామంటూ టికాయత్ వార్నింగ్

|
Google Oneindia TeluguNews

మోదీ సర్కార్ తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా గడిచిన 7 నెలలుగా నిరసనలు చేస్తోన్న రైతులపై మరోసారి దాడి జరిగింది. అధికార బీజేపీ నేతలు, కార్యకర్తలు రైతుల శిబిరాల్లోకి చొరబడి గలాటా సృష్టించడంతో ఘర్షణలు జరిగాయి. శాంతియుతంగా సాగుతోన్న ఉద్యమంలో హింసను చొప్పించేందుకు కాషాయనేతలు ప్రయత్నిస్తున్నారంటూ రైతు సంఘాల నేత రాకేశ్ టికాయత్ మండిపడ్డారు. వివరాలివి..

జగన్ దెబ్బకు కదిలిన మోదీ: వ్యాక్సిన్ల పంపిణీపై కేంద్రం కీలక సవరణలు -ప్రైవేట్ ఆస్పత్రులకు భారీ షాక్జగన్ దెబ్బకు కదిలిన మోదీ: వ్యాక్సిన్ల పంపిణీపై కేంద్రం కీలక సవరణలు -ప్రైవేట్ ఆస్పత్రులకు భారీ షాక్

వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం గతేడాది మూడు చట్టాలను తీసుకురావడం, వాటిని వెనక్కి తీసుకోవాలంటూ వేలాది మంది రైతులు గత 7 నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తుండటం తెలిసిందే. జనవరిలో హింస తలెత్తిన తర్వాత రైతులతో కేంద్రం చర్చలకు బ్రేక్ పడింది. మళ్లీ చర్చలకు సిద్ధమంటూ కేంద్రం ఇటీవలే ప్రకటన చేసింది. అయితే, చట్టాలను మాత్రం వెనక్కి తీసుకోబోమని స్పష్టం చేసింది. ఈ క్రమంలో రైతు ఉద్యమంలోకి చొరబడేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించడంతో అక్కడక్కడా ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. బుధవారం నాడు..

Clashes Between BJP Workers And Protesting Farmers at Ghaziabad, Rakesh Tikait slams bjp

ఢిల్లీ -యూపీ సరిహద్దు అయిన ఘాజీపూర్ వద్ద బుధవారం తీవ్ర ఉద్రిక్తత, ఘర్షణ తలెత్తాయి. నిరసనలు మొదలై ఏడు నెలలు పూర్తయిన సందర్భంగా బీకేయూ నేత రాకేశ్ టికాయత్ ఆధ్వర్యంలో ఘాజీపూర్ శిబిరం వద్ద ఓ కార్యక్రమాన్ని నిర్వహించగా, ఆ వేదికను ఆక్రమించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారు. బీజేపీకి చెందిన ఓ నేత కారు అద్దాలు పగలడంతో పార్టీ కార్యకర్తలు, రైతులకు మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరు వర్గాలు తోపులాటకు దాడులకు దిగాయి. పోలీసుల జోక్యంతో అతి కష్టం మీద పరిస్థితి అదుపులోకి వచ్చింది. కాగా

అవును, నిజం!: డెల్టా వేరియంట్‌ను చంపేసిన కోవాగ్జిన్ -భారత్ బయోటెక్ టీకాకు అమెరికా దిగ్గజ సంస్థ వత్తాసుఅవును, నిజం!: డెల్టా వేరియంట్‌ను చంపేసిన కోవాగ్జిన్ -భారత్ బయోటెక్ టీకాకు అమెరికా దిగ్గజ సంస్థ వత్తాసు

Clashes Between BJP Workers And Protesting Farmers at Ghaziabad, Rakesh Tikait slams bjp

ఘాజీపూర్ సరిహద్దులోని రైతు ఉద్యమ శిబిరాలపై బీజేపీ నేతల దాడిని రైతు సంఘం నేత రాకేశ్ టికాయత్ తీవ్రంగా ఖండించారు. రైతుల శిబిరాన్ని కబ్జా చేయాలని చూస్తే బీజేపీ నేతల తోలు ఒలిచేస్తామంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ మద్దతు దారులు తమ సమావేశం దగ్గరికి వచ్చి, బీజేపీ నేతలను స్వాగతించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారనని, చట్టాలను వెనక్కి తీసుకోకుండా ఇలా చేయడం తగదని, ఘాజీపూర్ సహా ఉద్యమం కొనసాగుతోన్న ప్రాంతాల్లోని శిబిరాలన్నీ రైతుల వేదికలేనని, యునైటెడ్ ఫ్రంట్ పతాకంపై రైతులందరూ ఐక్యంగా ఉన్నారని, ఈ సమావేశానికి ఎవరైనా రావలనుకుంటే బీజేపీ పార్టీని వీడి రావాల్సిందేనని షరతు విధించామని రాకేశ్ టికాయత్ చెప్పారు. రైతుల వేదికపై బీజేపీ తన జెండాను పాతాలని చూస్తోందని, అది పూర్తిగా తప్పని టికాయత్ హెచ్చరించారు.

English summary
On Wednesday, June 30, a massive clash broke out between the farmers and BJP workers at the Ghazipur border. Farmers have been protesting against the three farm laws proposed by the Centre for the past 7 months. the situation is brought under control by the Police. Bharatiya Kisan Union spokesperson Rakesh Tikait in a statement accused some people of hurling abuses, raising BJP flags and pelting stones at protesters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X