దాడి చేసిన ఉగ్రవాదుల్లో పదో తరగతి విద్యార్థి

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు చేసిన దాడి చేసినవారిలో పదో తరగతి విద్యార్థి ఉన్నాడు. సిఆర్పీఎఫ్ శిబిరంపై ఉగ్రవాదులు చేసిన దాడిలో ఐదుగురు భద్రతా సిబ్బంది అధికారులు మరణించిన విషయం తెలిసిందే.

కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడిలో ఐదుగురు సైనికుల మృతి

ఉగ్రవాదులపై భద్రతా దళాలు చేసిన దాడిలో మరణించిన ఉగ్రవాదుల్లో పదో తరగతి విద్యార్థి ఉన్నట్లు గుర్తించారు. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదం విస్తరిస్తున్న తీరుకు ఇది నిదర్శనమనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Class 10 student among terrorists who attacked CRPF camp in Pulwama

దానికితోడు, ఆ పదో తరగతి విద్యార్థి తండ్రి జమ్మూ కాస్మీర్ పోలీసు శాఖలో పనిచేస్తున్నాడు. భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించిన విషయం తెలిసిందే.

సిఆర్పీఎఫ్ శిబిరం మీద ఆదివారం తెల్లవారు జామున దాడి చేసినవారంతా కాశ్మీరేలనని గుర్తించారు. అయితే, ఈ దాడికి పాల్పడింది తామేనని జైషే మొహమ్మద్ ప్రకటించుకుంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The terrorist attack on a CRPF camp in Jammu and Kashmir's Pulwama, which killed five security personnel, one of the terrorists killed was a Class 10 student.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి