కిందకు దూసుకొచ్చిన హెలికాప్టర్, సీఎం రమణ్‌కు తప్పిన ముప్పు
నయా రాయపూర్: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఆ హెలికాప్టర్ దాదాపు 150 కిలోమీటర్ల కిందకు దూసుకు వచ్చింది. అయితే, పైలట్ చాకచక్యంగా హెలికాప్టర్‌ను కిందకు దింపాడు. దీంతో ప్రమాదం తప్పింది.

దీంతో ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఈరోజు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. కాంకేర్ జిల్లాలోని సుకుమా నుంచి వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో హెలికాప్టర్ నాలుగు వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది.
హఠాత్తుగా 150 అడుగుల కిందకు దూసుకు వచ్చింది. అయితే పైలట్ హెలికాప్టర్‌ను నియంత్రించి సురక్షితంగా కిందకు దించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్లలో సమస్య వచ్చినట్లుగా టెక్నికల్ టీమ్ చెప్పింది.












Click it and Unblock the Notifications