సీఎం ఎవరు ?, సీఎల్ పీ మీటింగ్, హోటల్ ముందు హైటెన్షన్, హై అలర్ట్, ఫ్యాన్స్ !

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 135 ఎమ్మెల్యేలను గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు సీఎం ఎవరు అని వర్గపోరు మొదలైయ్యింది. మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ వర్గీయులు మా నాయకుడిని సీఎం చెయ్యాలంటే లేదు మా నాయకుడిని సీఎం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.

బెంగళూరు నగరంలోని వసంత నగర్ లోని షాంగ్రిలా హోటల్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మకాం వేశారు. ఇదే హోటల్ లో సీఎల్ పీ సమావేశం మొదలైయ్యింది. ఢిల్లీ నుంచి బీజేపీ హైకమాండ్ నాయకులు బెంగళూరు చేరుకున్నారు. కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్ తో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ షాంగ్రిలా హోటల్ కు చేరుకున్నారు.

 high tension in front of private hotel in Bengaluru.

హోటల్ బయట డీకే శివకుమార్ వర్గీయులు, సిద్దరామయ్య వర్గీయులు మా నాయకుడిని సీఎం చెయ్యాలని డిమాండ్ చేస్తూ ప్లే కార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. డీకే శివకుమార్ జిందాబాద్, కాబోయే సీఎం సిద్దరామయ్య జిందాబాద్ అంటూ పోటాపోటీగా నినాదాలు చెయ్యడంతో ఆ ప్రాంతం దద్దరలింది.

ముందు జాగ్రత్త చర్యగా హోటల్ ముందు, హోటల్ పరిసర ప్రాంతాల్లో బెంగళూరు సిటీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హోటల్ దగ్గర, పరిసర ప్రాంతాల్లో పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దింపారు. హోటల్ లో సీఎల్ పీ సమవేశం మొదలు కావడంతో బయట ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎవరు సీఎం ? అనే టెన్షన్ మొదలైయ్యింది.

కర్ణాటకలోని అనేక జిల్లాల్లో ఉన్న మాజీ సీఎం సిద్దరామయ్య అభిమానులు, డీకే శివకుమార్ అభిమనులు వేలాది మంది బెంగళూరు బయలుదేరారు. సీఎం పేరు ప్రకటిస్తే మరో నాయకుడి అనుచరులు రెచ్చిపోయే అవకాశం ఉందనే అనుమానంతో పోలీసులు ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+