మరింత ముదిరిన సీఎం అమరీందర్-సిద్ధూ గొడవ... బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనన్న కెప్టెన్...

పంజాబ్‌లో ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్,టీపీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. అమరీందర్ సింగ్ అభిప్రాయాన్ని తోసిరాజని కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధూ చేతిలో పగ్గాలు పెట్టడంతో కెప్టెన్ అమరీందర్ తీవ్ర అసహనంలో ఉన్నారు. ఈ వివాదాన్ని మరింత పెంచేలా కెప్టెన్ అమరీందర్ సింగ్ తాజాగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అమరీందర్ సింగ్ మీడియా సలహాదారు రవీన్ తుక్రాల్ ఈ వివరాలు వెల్లడించారు.

అప్పటివరకూ సిద్ధూని కలిసేది లేదు : అమరీందర్ వర్గాలు

పీసీసీ చీఫ్‌గా నియమితులైన నేపథ్యంలో కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో భేటీకి సిద్ధూ అపాయింట్‌మెంట్ కోరినట్లు వస్తున్న వార్తలపై రవీన్ తుక్రాల్ ట్విట్టర్‌లో స్పందించారు.'అమరీందర్‌ను కలిసేందుకు సిద్ధూ అపాయింట్‌మెంట్ కోరుతున్నట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. సిద్ధూ ఇప్పటివరకూ అపాయింట్‌మెంట్ కోరలేదు. అసలు సిద్దూ అమరీందర్ సింగ్‌కు బహిరంగ క్షమాపణలు చెప్పేంతవరకూ సీఎం అమరీందర్ సింగ్‌ ఆయన్ను కలవరు.' అని వెల్లడించారు. సీఎంపై వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో అవమానకర రీతిలో సిద్ధూ దాడి చేశాడని ఆరోపించారు.సిద్దూ క్షమాపణ చెప్పేంతవరకూ అమరీందర్ వైఖరిలో ఎటువంటి మార్పు ఉండదన్నారు.

తొలి నుంచి వ్యతిరేకిస్తున్న అమరీందర్

తొలి నుంచి వ్యతిరేకిస్తున్న అమరీందర్


టీపీసీసీ చీఫ్‌గా సిద్ధూని నియమించవద్దని అమరీందర్ సింగ్ పదేపదే కాంగ్రెస్ అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్నవారిని,దళిత,హిందూ వర్గాలకు చెందిన సీనియర్ నేతలను కాదని సిద్ధూకి ఆ పదవి ఇవ్వడం సరికాదన్నారు. సిద్ధూకి టీపీసీసీ చీఫ్ పదవి ఇస్తే పార్టీలో సమస్యలు వస్తాయని.. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఆ ప్రభావం ఉంటుందన్నారు. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం సిద్ధూకే పదవి కట్టబెట్టింది. దీంతో అమరీందర్ సింగ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

Recommended Video

    Modi Cabinet Expansion : New Cabinet Ministers | PM Modi Cabinet 2.0 | Oneindia Telugu
    ఇలాగే కొనసాగితే కష్టమే...

    ఇలాగే కొనసాగితే కష్టమే...

    తాను ఎంతగా వ్యతిరేకించినప్పటికీ సిద్ధూకే పదవి కట్టబెట్టడం అమరీందర్‌కు మింగుపడటం లేదు. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెబుతూనే సిద్ధూని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికలకు ఇక ఏడాది కాలమే ఉన్న తరుణంలో కాంగ్రెస్‌లో విభేదాలు ఇలా తారాస్థాయికి చేరడం పార్టీలో అలజడి రేపుతున్నాయి.పరిస్థితి ఇలాగే కొనసాగితే అది కాంగ్రెస్‌కు నష్టం చేసే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందన్నది వేచి చూడాలి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+