Haryana Elections 2024: హర్యానా బీజేపీలో విచిత్రం-ఎన్నికలు తర్వాత సీఎం పోస్టు తేల్చండి.. !

హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 5న ఒకే విడతలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ చావో రేవో తేల్చుకుంటున్నాయి. అయితే బీజేపీ ప్రస్తుత సీఎం నాయబ్ సింగ్ సైనీనే మరోసారి సీఎం అభ్యర్ధిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్తోంది. ఇది నచ్చని పార్టీ సీనియర్ నేత అనిల్ విజ్ తనకూ ముఖ్యమంత్రి పదవి కావాలని కోరుతున్నారు. దీంతో ఎన్నికలకు ముందే బీజేపీలో సీఎం కుర్చీ కోసం రేసు మొదలైనట్లే.

సీఎం నాయబ్ సింగ్ సైనీని మరోసారి ముఖ్యమంత్రి అభ్యర్దిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్తున్న బీజేపీకి అనిల్ విజ్ షాకిచ్చారు. తానూ రేసులో ఉన్నానని అధిష్టానానికి తేల్చిచెప్పారు. పార్ట నుంచి ఇప్పటివరకూ తాను ఏమీ కోరుకోలేదని, కానీ ప్రజలు తన దగ్గరికి వచ్చి ఇంత సీనియర్ అయిన మీరు సీఎం ఎందుకు కాలేదని అడుగుతున్నారని అనిల్ విజ్ చెప్పుకొచ్చారు. ప్రజల డిమాండ్ తో పాటు తన సీనియార్టీని దృష్టిలో ఉంచుకుని సీఎం పదవికి పోటీ పడుతున్నట్లు తెలిపారు.

cm post race between nayab singh saini and anil vij in bjp before Haryana elections

తనకు సీఎం పదవి ఇవ్వాలా వద్దా అనేది బీజేపీ అధిష్టానం నిర్ణయమని అనిల్ విజ్ తెలిపారు. అడగటం మాత్రం తన హక్కు అన్నారు. తనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే హర్యానా రూపంతో పాటు రాష్ట్ర జాతకం మార్చేస్తానని మాత్రం చెప్పుకొచ్చారు. నాయబ్ సైనీని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించినా మరొకరు సీఎం పోస్టు అడగకూడదని ఏమీ లేదంటున్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు సీఎం పదవి అడిగే హక్కు ఉందంటున్నారు. దీంతో బీజేపీ అధిష్టానం తలపట్టుకుంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+