ఐటీ హబ్ ప్రజలకు సీఎం గుడ్ న్యూస్, త్వరలో ఉద్యోగ మేళ, నిరుద్యోగులకు పండగ !
ఉద్యోగాల కోసం వెతుకుతున్న యువతకు, విద్యాభ్యాసం పూర్తి చేసుకుని మంచి ఉద్యోగాలు సంపాధించాలని ఆశపడుతున్న యువతి, యువకులకు సీఎం గుడ్ న్యూస్ చెప్పారు. ఉద్యోగం కోసం కష్టపడుతున్న గ్రాడ్యుయేట్లకు మంచి అవకాశం లబిస్తోంది. ముఖ్యంగా బెంగళూరులో ఉద్యోగాల కోసం తిరుగుతున్న యువకులకు కర్ణాటక ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
కొత్త సంవత్సరం ప్రారంభంతో మీకు కొత్త ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత యువతి, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మాట ఇచ్చింది. ఇప్పుడు బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలో నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టడానికి సిద్దరామయ్య ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సిద్దం అయ్యింది.

శుక్రవారం బెంగళూరులో సీఎం సిద్దరామయ్య ఆధ్వర్యంలో మంత్రులు, అధికారులతో ప్రత్యేక సమావేశం అయ్యింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలో దెబ్బతిన్న పరిశ్రమలు, కంపెనీలకు పూర్వవైభవం తీసుకురావడం ఎలా అని క్షుణ్ణంగా చర్చించారని తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే బెంగళూరులో కన్నడిగులకు ఎక్కువ ఉద్యోగాలు దక్కేలా చూస్తామని సిద్దరామయ్య హామీ ఇచ్చారు.
శుక్రవారం సీఎం సిద్దరామయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో బెంగళూరులో ఉద్యోగ మేళ నిర్వహించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారని తెలిసింది. సమావేశం పూర్తి అయిన తరువాత సీఎం సిద్దరామయ్య ఆయన అధికారిక ట్విటర్ (ఎక్స్) పేజ్ లో ఓ పోస్టు చేశారు. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే బెంగళూరులో ఉద్యోగ మేళ ఉంటుందని సీఎం సిద్దరామయ్య క్లారిటీ ఇచ్చారు. సిద్దరామయ్యతో పాటు డీసీఎం డీకే శివకుమార్, పలువురు సీనియర్ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications