తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక ప్రకటనలు: డీజిటల్ డీఎల్, చెన్నైపై వరాలు

తమిళనాడు వ్యాప్తంగా గత అయిదేళ్ల కాలంలో నిరసనలు తెలిపిన రైతులు, ఉపాధ్యాయులపై నమోదైన అన్ని కేసులను ఉపసంహరిస్తున్నట్లు ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో ప్రకటించారు. రూల్ 110 కింద ఆయన ఈ అంశాన్ని ప్రతిపాదించారు. ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా, మానవతా దృక్పథంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. 2021 మే నుంచి ఈ ఏడాది ఏప్రిల్ మధ్య కాలంలో నమోదైన కేసులన్నీ ఇందులో ఉన్నాయి.

పరందూరు విమానాశ్రయ నిర్మాణం వల్ల సాగు భూమితో పాటు జీవనోపాధి కోల్పోతామంటూ రైతులు చేసిన ఆందోళనల, తిరువణ్ణామలై సిప్‌కాట్ పారిశ్రామిక జోన్‌కు వ్యతిరేకంగా సాగిన నిరసనల్లో నమోదైన కేసులన్నింటినీ కూడా ఎత్తివేస్తోన్నామని, వివాదాస్పద పీడీ యాక్ట్ కింద దాఖలైన కేసులను కూడా రద్దు చేస్తోన్నట్లు విజయ్ ప్రకటించారు. రైతులు, ఉపాధ్యాయులకు ఎప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.

CM Vijay announces Cases Against Farmers and Teachers for Peaceful Protests Withdrawn DMK Regime

దీంతో పాటు రూ. 4,800 కోట్లతో భారీ తాగునీటి ప్రాజెక్టులను అసెంబ్లీ వేదికగా ప్రకటించారాయన. చెన్నై ఉత్తర ప్రాంతం, ఆవడి, పొన్నేరి ప్రాంతాల అవసరాల కోసం మింజూరులో 400 ఎంఎల్‌డీ సామర్థ్యంతో డీశాలినేషన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఆవడి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని ఇళ్లకు 24 గంటలూ తాగునీటిని అందించడానికి రూ. 500 కోట్లతో కొత్త పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు.

కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్‌- ఆ కీలకాంశాలు
కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్‌- ఆ కీలకాంశాలు

మదురై, కడలూరు సహా పలు మున్సిపాలిటీలు, పంచాయతీల్లో నీటి సదుపాయాల కల్పనకు రూ. 1,000 కోట్లను తమిళనాడు ప్రభుత్వం కేటాయించింది. చెన్నై కీల్పాక్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచేందుకు రూ. 410 కోట్లతో మరో ప్రాజెక్టు చేపట్టనున్నారు. వీటితో పాటు తిరునెల్వేలి, సేలం ప్రాంతాలలో చెత్త నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణ అంచనా వ్యయం దాదాపు రూ. 547 కోట్లు.

నరసాపూర్ నుంచి తమిళనాడుకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ కు కొత్తగా ఈ రెండు స్టేషన్లల్లో హాల్ట్ సౌకర్యం
నరసాపూర్ నుంచి తమిళనాడుకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ కు కొత్తగా ఈ రెండు స్టేషన్లల్లో హాల్ట్ సౌకర్యం

సెప్టెంబర్ 15 నుంచి డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను డిజిటలైజ్ చేయనున్నట్లు విజయ్ తెలిపారు. క్యూఆర్ కోడ్ ఆధారితమైన ఈ డాక్యుమెంట్లను స్మార్ట్‌ఫోన్ల ద్వారా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇకపై డ్రైవింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వెంటనే డిజిటల్ లైసెన్స్ అందించేలా విధివిధానాలు రూపొందిస్తోన్నారు. డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ, వాహనాల రిజిస్ట్రేషన్ ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా చేసుకునేలా మార్పులు తీసుకురానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+