Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేరళ సర్కారుపై అవిశ్వాస తీర్మానం: నెగ్గిన పినరయి విజయన్, విపక్షాలపై తీవ్ర ఆగ్రహం

తిరువనంతపురం: కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ సోమవారం కేరళ అసెంబ్లీలో పినరయి విజయన్ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాత తీర్మానం వీగిపోయింది. అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 87 మంది ఓట్లు వేశారు. ఇక అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా కేవలం 40 మంది మాత్రమే ఓటు వేశారు.

ఈ క్రమంలో పినరయి విజయన్ సర్కారు సునాయాసంగా బలపరీక్ష్లలో నెగ్గినట్లయింది. కాగా, ఈ తీర్మానం సందర్భంగా సీఎం పినరయి విజయన్ సుమారు 3గంటలా 40 నిమిషాలపాటు ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, ముస్లీం లీగ్ పార్టీలపై విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 CM vijayans Near 4-Hour Reply; Kerala Government Clears no-confidence motion

సోమవారం ఉదయం ప్రారంభమైన సమావేశాలు.. రాత్రి 9గంటల వరకు కొనసాగడం గమనార్హం. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన కీలక ప్రాజెక్టుల గురించి సీఎం విజయన్ వివరిస్తుండగా.. ప్రతిపక్ష సభ్యులు తమ కూర్చీల్లోంచి లేచి సీఎం అవినీతి పరుడంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో సీఎం విజయన్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాను చెప్పేది వినకుండా ఇలా నిరసనలు చేయడం సరికాదని సీఎం వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో సభ్యులు ఒక్కదగ్గరి చేరుకోవడంతో స్పీకర్ కల్పించుకుని.. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని భౌతిక దూరం పాటించాలని కోరారు. ప్రతిపక్షాల ప్రశ్నలకే సీఎం సమాధానం చెబుతున్నారంటూ స్పీకర్ వారిని వారించారు.

Recommended Video

    Kerala's Rajamalai Landslide:రాజమలైలో 43కి చేరిన మృతుల సంఖ్య,శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు

    కాగా, యూడీఎఫ్ ఎమ్మెల్యే వీడీ సతీశన్ అసెంబ్లీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వాన్ని నడపడంలో సీఎం విజయన్ పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. స్మగ్లింగ్ కేసుకు సంబంధించిన వివరాలు తనకు తెలియని అన్నారని చెప్పారు. స్మగ్లింగ్ కేసులో ప్రభుత్వ ప్రమేయం ఉందని, ప్రజలకు నిర్మించే ఇళ్లలో కోట్ల రూపాయలను కమీషన్లుగా తీసుకుంటోందని ఆరోపించారు. ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితల కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+