Coding Ninjas: ఉద్యోగులను ఆఫీస్‍లో ఉంచి తాళం వేసిన కంపెనీ.. వైరల్ అయిన వీడియో..
ఉద్యోగులు బయటకు రాకుండా ఆఫీస్ కు తాళం వేసిన ఘటన గురుగ్రామ్ లో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండియన్ ఎడ్‌టెక్ సంస్థ కోడింగ్ నింజాస్ తమ ఉద్యోగులు బయటకు వెళ్లకుండా ఉండేందుకు కార్యాలయానికి తాళం వేసింది.
మేనేజర్ అనుమతి లేకుండా ఉద్యోగులు బయటకు వెళ్లకుండా నిరోధించడానికి కంపెనీ కార్యాలయం ప్రవేశ ద్వారం తలుపులకు తాళం వేసే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ వీడియో లింక్డ్‌ఇన్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో వైరల్ అయింది. ఈ వీడియోలో ఆఫీస్ సెక్యూరిటీ గార్డ్ ప్రధాన ద్వారాని తాళం వస్తున్నాడు. అతన్ని ఎందుకు తాళం వేస్తున్నావని అడగ్గా.. అనుమతి లేకుండా ఏ ఉద్యోగిని బయటకు పంపొద్దని మేనేజర్ చెప్పినట్లుగా తెపాడు. బయటకు వెళ్లాలంటే అనుమతి తీసుకోవాలని కోరాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా చాలా మంది కంపెనీ తీరుపై విరుచుకుపడుతున్నారు. ఇదేనా పని చేసే వాతావరణం అని ప్రశ్నిస్తున్నారు.

ఈ వీడియో వివాదాస్పదంగా మారడంతో కోడింగ్ నింజాస్ కూడా ఈ సంఘటనపై స్పందించింది. నాలుగు కార్యాలయాలలో ఒకదానిలో "విచారకరమైన చర్య" జరిగిందని చెప్పింది. కంపెనీ వ్యవస్థాపకులు కూడా తమ విచారం వ్యక్తం చేశారు. ఉద్యోగులందరికీ క్షమాపణలు చెప్పారు.
ఓ ఉద్యోగి చేసిన తప్పు వల్ల ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. సదరు ఉద్యోగి తన పొరబాటును అంగీకరించి క్షమాపణలు కూడా చెప్పాడని పేర్కొన్నారు.
"సంఘటన వెలుగులో, వ్యవస్థాపకులు తమ విచారం వ్యక్తం చేశారు మరియు ఉద్యోగులందరికీ క్షమాపణలు చెప్పారు. ఇది ఒక వివిక్త సంఘటన,ఇది పునరావృతం కాకుండా ఉండేలా మేము ముందస్తు చర్యలు తీసుకుంటున్నాము. సంబంధిత ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నాము" అని పేర్కొంది.
EdTech startup Coding Ninjas locks up its office to prevent employees from leaving until the boss allows.#CodingNinjas
— Annu Kaushik (@AnnuKaushik253) June 4, 2023
🎥Himanshu Atal on LinkedIn pic.twitter.com/dR4UIL5DDF
వీడియోను లింక్డ్‌ఇన్‌లో యూనిక్ ఇంప్రింట్స్ సహ వ్యవస్థాపకుడు హిమాన్షు అటల్ షేర్ చేశారు. "కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగుల దోపిడీ, పని వాతావరణాన్ని దిగజార్చడం ఒక కొత్త ట్రెండ్" అని అటల్ పోస్ట్ లో పేర్కొన్నారు. తాళం వేసి ఉన్నప్పుడు అగ్ని ప్రమాదాలు జరిగితే పెద్ద ముప్పు వాటిల్లితుందని పలువురు నెటిజన్లు కామెంట్ల్ చేశారు. కోడింగ్ నింజాస్ 2016లో స్థాపించారు.ఈ కంపెనీలో 150 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు.












Click it and Unblock the Notifications