కుంభమేళాకు కోల్డ్‌ప్లే సింగర్ క్రిస్ మార్టిన్.. ప్రయాగ్‌లో పుణ్యస్నానాలు
మహా కుంభమేళా (Maha Kumbh Mela)కు మన దేశంలో నుంచే గాక ప్రపంచంలోని నలు మూలల నుంచి కోట్లాది మంది భక్తులు వచ్చి ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా, మహా కుంభమేళాకు ప్రముఖ బ్యాండ్ కోల్డ్‌ప్లే సింగర్ క్రిస్ మార్టిన్ (Chris Martin), అతడి స్నేహితురాలు డకోటా జాన్సన్ వచ్చారు. వీరిద్దరూ త్రివేణి సంగమంలో పుణ్యస్నానమాచరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
గత కొంత కాలంగా క్రిస్ మార్టిన్ భారత్‌లో వరుసగా మనదేశంలో మ్యూజిక్ కాన్సర్ట్‌లు చేస్తున్నారు. ఇటీవల ముంబైలో ఒకటి జరిగింది. ఆ తర్వాత జనవరి 25, 26 తేదీ్లో గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో కాన్సర్ట్ నిర్వహించగా.. బాలీవుడ్ నటుడులు, గాయకులతోపాటు భారీ సంఖ్యలో అభిమానులు తరలిచ్చారు. ఇదే సమయంలో ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతుంటంతో ప్రయాగ్ రాజ్ వచ్చి పుణ్యస్నానమాచరించారు క్రిస్ మార్టిన్.

Video of Coldplay Singer Chris Martin and Dakota Johnson taking the holy dip at Maha Kumbh in Prayagraj. pic.twitter.com/yqSH9mj8cc
— Let's Talk TV|Latest Updates (@letstalktv___) February 1, 2025
కాగా, ఇటీవల అహ్మదాబాద్‌లో నిర్వహించిన కన్సర్ట్‌లో తాను తెలంగాణ వాడినేనని క్రిస్ మార్టిని ప్రటించడం గమనార్హం. తన ఈవెంట్‌లలో తాను ఎక్కడికి వెళితే అక్కడ ఆ ప్రాంతంకి చెందిన వాడినని క్రిస్ చెబుతుంటాడు. ఇండియా కన్సర్ట్‌లో కూడా తాను తెలంగాణ వాడినని.. తమ బ్యాండ్‌కు చెందిన సభ్యులంతా భారత్‌కు చెందినవారేనని చెప్పుకోచ్చారు. అయితే క్రిస్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలోని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నువ్వు మా తెలంగాణ ముద్దు బిడ్డవి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Telangana muddu bidda Chris Martin 😍
— Naveena (@TheNaveena) January 26, 2025
I wasn’t this happy even at a live Coldplay concert… Dil khush ❤️ pic.twitter.com/nLPSFM7YCv
మరోవైపు, ఈ విషయంపై టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ కూడా స్పందించారు. ఇన్‌స్టా వేదికగా రాసుకోస్తూ.. వెల్‌కమ్ క్రిస్ మార్టిన్. జై బోలో తెలంగాణ సినిమాలోని పొడుస్తున్న పొద్దు మీద సాంగ్‌తో పాటు, కోల్డ్ ప్లే మీద ఎవరైనా మ్యాషప్ చేస్తే బాగుంటుంది అని విజయ్ రాసుకోచ్చారు. దీంతో కామెంట్ వైరల్‌గా మారింది. ఇందుకు మద్దతుగా పలువురు నెటిజన్లు పోస్టులు పెట్టారు.












Click it and Unblock the Notifications