గ్యాస్ సిలిండర్లపై కేంద్రం గుడ్ న్యూస్

Commercial LPG Cylinder Price: వంటగ్యాస్ వినియోగదారులకు స్వల్పంగా ఊరట లభించింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల సిలిండర్ ధరలు తగ్గాయి. ఒక్కో సిలిండర్‌పై రూ. 6.50 పైసల మేర తగ్గుముఖం పట్టాయి. ఈ ధరలు ఈ తెల్లవారు జాము నుంచే అమలులోకి వచ్చాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే చమురు కంపెనీలు ఓ ప్రకటన విడుదల చేశాయి. గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు.

సెప్టెంబర్ 1న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ వంట గ్యాస్ సిలిండర్ల ధరలను రూ. 51.50 తగ్గించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 1న ఆరంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సర ప్రారంభంలో వాణిజ్య సిలిండర్ల ధరలను రూ. 41 తగ్గించి వినియోగదారులకు కొంత ఉపశమనం కల్పించాయి. కిందటి నెల వరకు కొనసాగింది. అక్టోబర్ 1వ తేదీన స్వల్పంగా పెరిగాయి. ఒక్కో సిలిండర్‌పై రూ. 15.50 పైసలను అదనంగా చెల్లించాల్సి వచ్చింది. ఇప్పుడు తాజాగా మరోసారి తగ్గుదల చోటు చేసుకుంది.

Commercial LPG Gas Cylinder Prices Take a Plunge

ఈ తగ్గింపుతో ఢిల్లీలో 19 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 5 తగ్గి రూ. 1,590.5 కి చేరుకుంది. గతంలో ఇది రూ. 1,595.50గా ఉండేది. కోల్‌కతాలో రూ. 6.5 తగ్గి రూ. 1,694 కి చేరింది. కిందటి నెల ఇది రూ. 1,700.50. ముంబైలో రూ. 5 తగ్గి రూ. 1,542 కి చేరింది. అంతకుముందు రూ. 1,547 ఉండేది. చెన్నైలో రూ. 4.5 తగ్గి రూ. 1,750 కి చేరుకుంది. గతంలో ఈ ధర రూ. 1,754.50 గా ఉండేది.

గృహ వినియోగం కోసం ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు. 14.2 కిలోల గృహ ఎల్పీజీ సిలిండర్ రేట్లు యధాతథంగా కొనసాగుతున్నాయి. ఇండియన్ ఆయిల్ ప్రకారం.. ఢిల్లీ- రూ. 853.00, గుర్గావ్- రూ. 861.5, అహ్మదాబాద్- రూ. 860, జైపూర్- రూ. 856.5, పాట్నా- రూ. 942.5, ఆగ్రా- రూ. 865.5, మీరట్- రూ. 860, ఘజియాబాద్- రూ. 850.5, ఇండోర్- రూ. 881, భోపాల్- రూ. 858.5, లూధియానా- రూ. 880, వారణాసి- రూ. 916.50 పైసలు, లక్నో-రూ. 890.50 పైసలు, ముంబై- రూ. 852.50 పైసలు, పూణే- రూ. 856, హైదరాబాద్- రూ. 905, బెంగళూరు 855.50 పైసలు ఉంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+