డేరా బాబా ‘హనీప్రీత్’అంటూ వాట్సప్ గ్రూప్‌లో అశ్లీల వీడియో: ఎంపీపై ఫిర్యాదు

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: వాట్సాప్‌ గ్రూప్‌‌లో అశ్లీల వీడియోను పోస్ట్ చేసిన ఎంపీ హరీందర్ సింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీగా గెలిచిన ఈయనను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతుండటంతో గతంలోనే సస్పెండ్‌కు గురయ్యారు. తాజా వాట్సప్ గ్రూపులో అశ్లీల వీడియో పోస్టు చేసి బుక్కయ్యాడు.

హనీప్రీత్ అంటూ..

హనీప్రీత్ అంటూ..

అంతేగాక, ఆ వీడియోకు గుర్మీత్‌ రామ్ రహీమ్‌ సింగ్ దత్త పుత్రిక హనీప్రీత్‌ సింగ్‌‌దేనంటూ కాప్షన్‌ కూడా పెట్టారు. దీంతో అదే గ్రూపులో సభ్యురాలిగా ఉన్న రేణు సోనియా అనే మహిళ.. సదరు ఎంపీపై తీవ్రంగా మండిపడ్డారు. దీంతో వెంటనే గ్రూప్‌ నుంచి హరిందర్‌ బయటికి వెళ్లిపోయారు.

ఫిర్యాదు..

ఫిర్యాదు..

కాగా, ఈ వ్యవహారంపై రేణు సోనియా పలువురు మానవ హక్కుల కార్యకర్తలను వెంటపెట్టుకుని మరీ వెళ్లి లూథియానా డీఐజీకి ఫిర్యాదు చేశారు. ఓ ప్రజా ప్రతినిధి అయి ఉండి ఆయన ఇలాంటి పిచ్చి పనులు చేయటం సరికాదని ఆమె అన్నారు. దీనిపై ప్రశ్నిస్తే సదరు ఎంపీ.. సమాధానం ఇవ్వకపోవటంపై రేణు మండిపడుతున్నారు.

పొరపాటేనంటూ..

పొరపాటేనంటూ..

రేణు సోనియా ఇచ్చిన కంప్లైంట్‌ను పరిశీలించిన పోలీస్‌ శాఖ ఖన్నా ఎస్‌ఎస్‌పీ నవజోత్‌సింగ్‌ మహల్‌కు విచారణ బాధ్యతలు అప్పజెప్పింది. కాగా, మహిళ ఆరోపిస్తున్నట్లుగా తానే వీడియో వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్ట్ చేయలేదని.. అది పొరపాటున జరిగిందని ఎంపీ హరిందర్‌ సింగ్‌ చెబుతున్నారు.

వారే అసభ్య వీడియోలు..

వారే అసభ్య వీడియోలు..

కొన్నాళ్ల క్రితం తాను ఇంగ్లాండ్ టూర్‌కు వెళ్లానని.. ఆ సమయంలో స్నేహితుడి ఇంట్లో బస చేసిన తాను ఫోన్‌ను పక్కన పడేశానని చెప్పారు. అయితే కొందరు యువకులు తన ఫోన్ లో అసభ్య వీడియో డౌన్‌లోడ్‌ చేసి.. గ్రూప్‌లో పోస్ట్ చేశారని చెప్పారు.

  చిన్నారులతో డేరాబాబా సెక్స్, ఆస్పత్రిలో గర్భస్రావాలే అధికం
  ఆ వీడియో గురించి అంతా వివరిస్తా..

  ఆ వీడియో గురించి అంతా వివరిస్తా..

  కాగా, వెంటనే తన భార్య వాట్సాప్ అన్‌ ఇన్‌స్టాల్‌ చేయమని సూచించగా.. తాను ఆ పని చేశానని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. అంతేగాక, కొందరు ఆప్‌ మహిళా కార్యకర్తలు కావాలనే తనపై ఆరోపణలు గుప్పిస్తున్నారని హరీందర్ చెప్పుకొచ్చారు. ఈ వీడియో గ్రూపులోకి ఎలా వెళ్లిందనే విషయంపై పోలీసులకు తాను పూర్తిగా వివరిస్తానని చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A POLICE complaint was filed against Fatehgarh Sahib MP Harinder Singh Khalsa for allegedly posting an ‘obscene video’ in a WhatsApp group. Khalsa, who was elected Fatehgarh Sahib MP on an Aam Aadmi Party (AAP) ticket, was suspended from the party for alleged anti-party activities by party national convener Arvind Kejriwal.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి