Porn addiction: పెరుగుతున్న పోర్న్ అడిక్షన్‌పై ఆందోళన.. పూర్తి నియంత్రణ సాధ్యమేనా?

Pornography: ఇటీవల దేశంలో రేప్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. మే నెలలో నేవి ముంబయిలోని ఖండేశ్వర్ ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల బాలుడు అతని 15 ఏళ్ల అక్కపై లైంగిక దాడి చేసి ఆమెను గర్భవతిని చేశాడనే వార్తలు సంచలనం సృష్టించాయి. దీనికి కారణం వారిరువురూ పోర్నోగ్రఫిక్ కంటెంట్‌ని కలిసి వీక్షించడమేనని వార్తలు వచ్చాయి.

2023 నవంబరులో 27 ఏళ్ల డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడు మహిళా కస్టమర్ల ఫోన్ నంబర్లను సేవ్ చేసుకుని వారికి అసభ్య వీడియోలను పంపించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అదే విధంగా 2022లో 14 ఏళ్ల బాలుడు తమ ప్రాంతంలోని 10 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి చేసినందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Concerns over increasing port addiction in India

ఈ సంఘటనలన్నింటికి మూల కారణం ఇంటర్నెట్‌లో సులభంగా పోర్నోగ్రఫీ యాక్సెస్‌ కలిగి ఉండటమేనని ఆరోపణలు వచ్చాయి. దీంతో పోర్నోగ్రఫీకి సంబంధించి మానసిక ప్రభావం, వ్యాప్తిని నియంత్రించడానికి ఉన్న చట్టపరమైన నిబంధనలు మరియు పోలీసులు తీసుకుంటున్న చర్యలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ మేరకు ఓ ప్రముఖ మీడియా సంస్థ పరిశోధన కూడా నిర్వహించి నివేదిక రిలీజ్ చేసింది.

నివేదిక ప్రకారం.. మానవ సంబంధాలపై పోర్నోగ్రఫీ తీవ్ర ప్రభావం చూపుతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. సన్నిహిత సంబంధాలను కాలరాస్తూ లైంగికతపై తప్పుడు అభిప్రాయాలను ప్రోత్సహిస్తుందని అభిప్రాయపడుతున్నారు. భావోద్వేగాలపై నియంత్రణను కోల్పోయే విధంగా చేసి హింసాత్మక లేదా హానికరమైన లైంగిక ప్రవర్తనలకు పురిగొల్పుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దీనిని గుర్తించిన దేశ ఉన్నత న్యాయస్థానం కూడా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసింది. బాలలకు సంబంధించి ఏ రూపంలోనైనా పోర్నోగ్రఫీని స్టోర్ చేయడం మరియు చూడడం, షేర్ చేయడం శిక్షార్హమని తీర్పునిచ్చింది. బాలల వేధింపులకు సంబంధించిన కంటెంట్‌పై ఇప్పటికే కఠిన చట్టాలు కూడా అందుబాటులో ఉన్నాయి. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 294, 295 బాలల గురించి అసభ్యకర ప్రచురణను నియంత్రిస్తాయి. సెక్షన్ 75 లైంగిక వేధింపులను, వ్యక్తి అంగీకారంలేకుండా పోర్నోగ్రఫీని చూపడం నేరమని చెబుతోంది. వీటికి మూడు నుంచి ఏడు ఏళ్ల వరకు శిక్షలు పడవచ్చు.

ఇంటర్నెట్ నుంచి ఈ కంటెంట్‌ను ఆపడం కష్టమైన పని అని అధికారులు అభిప్రాయపడుతున్నారు. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారాలు డొమైన్ నేమ్‌లను నిరోధించడం ద్వారా ఈ తరహా వీడియోలాను ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వెబ్‌సైట్ల డొమైన్ నేమ్ మార్చడం ద్వారా తిరిగి అదే కంటెంట్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలుస్తోంది. అదనంగా వినియోగదారులు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్‌లను (VPN) ఉపయోగించడం ద్వారా వీటిని సులభంగా చూడగలుగుతున్నట్లు అర్థమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+