రాహుల్ హిందూత్వ కామెంట్ల చిచ్చు-బీజేపీ కామెంట్స్ పై కాంగ్రెస్ ఎదురుదాడి
బీజేపీ అజెండాలో భాగమైన హిందూత్వను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల దుమారం కొనసాగూతూనే ఉంది. హిందూత్వ, హిందూమతం ఒక్కటి కాదంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యల్ని బీజేపీ తీవ్రంగా టార్గెట్ చేస్తోంది. దీనిపై స్పందించిన కాంగ్రెస్ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు.
రాహుల్ గాంధీ హిందూత్వపై చేసిన వ్యాఖ్యల్ని పార్టీ సీనియర్ నేత బీకే హరిప్రసాద్ సమర్ధించారు. హిందూత్వ, హిందూవాదం రెండూ విభిన్న వాదననల్ని ఆయన తెలిపారు. బీజేపీ చెప్పుకునే వీర్ సావర్కర్ రచనల్లో కూడా ఇది ఉన్నట్లు ఆయన గుర్తుచేశారు. బీజేపీ నేతలు వీర్ సావర్కర్ రచనల్ని సరిగ్గా చదివినట్లు లేరని ఆయన ఆక్షేపించారు. హిందూత్వ అనేది ఓ మతం కాదని జీవన విధానమని వీర్ సావర్కర్ చెప్పిన విషయాన్ని హరిప్రసాద్ మరోసారి గుర్తుచేశారు.
నిన్న జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఓరియంటేషన్ కార్యక్రమంలో రాహుల్ గాంధీ.. హిందుత్వం, హిందూమతం రెండు భిన్నమైన భావనలని వ్యాఖ్యానించారు. హిందూత్వం సిక్కును కొట్టడమా, లేక ముస్లిమ్‌ని కొట్టడమా. అనే దాన్ని సమర్ధిస్తుందని, కానీ హిందూ జీవన విధానం మాత్రం భిన్నమన్నారు. ఈ రెండు ఒకటేనని ఏ పుస్తకంలోనూ ఇప్పటివరకూ రాయలేదన్నారు. ఉపనిషత్తుల్లోనూ తానూ ఎక్కడా చదవలేదన్నారు.

హిందూత్వానికీ, హిందూ మతానికీ తేడా ఉందని మేం అంటున్నాం. ఇది సింపుల్ లాజిక్ - మీరు హిందువులైతే మీకు హిందుత్వం ఎందుకు కావాలి? మీకు ఈ కొత్త పేరు ఎందుకు అవసరం? అని రాహుల్ ప్రశ్నించారు. నేటి భారతదేశంలో సైద్ధాంతిక పోరాటం చాలా ముఖ్యమైనదని ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ప్రకటనపై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర స్పందిస్తూ.. హిందూమతం, దాని సంస్కృతిపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసిన చరిత్ర రాహుల్ కు ఉందని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ హిందుత్వంపై దాడి చేయడం చాలా బాధాకరమన్నారు. కాంగ్రెస్ నేతలు హిందూమతం పట్ల సైద్ధాంతిక ద్వేషం పెంచుతున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ లోని సల్మాన్ ఖుర్షీద్, శశి థరూర్, పి చిదంబరం వంటి నాయకులు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకున్నారని బిజెపి ఆరోపించింది.
-
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. రామయ్య ఆశీస్సులతో.. -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications