92 ఏళ్ల ముసలోడి మాటలకు మోడీ సర్కార్ పడిపోతుందా ? చిదంబరం ట్వీట్ సెటైర్లు..

యూఎస్ కుబేరుడు జార్జ్ సోరోస్ అదానీ గ్రూప్ అక్రమాల నేపథ్యంలో ప్రధాని మోడీ మౌనాన్ని ప్రశ్నించిన నేపథ్యంలో బీజేపీ నేతలు ఆయనపై విరుచుకుపడుతున్నారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీతో సంబంధాలున్నాయనే ఆరోపణలు కూడా చేస్తున్నారు. భారత్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు జరుగుతున్న కుట్రగా బీజేపీ నేతలు దీన్ని అభివర్ణిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఇవాళ ఘాటుగా స్పందించారు.

92 ఏళ్ల విదేశీ పిచ్చోడి మాటలకే కూలిపోయేంత బలహీనంగా మోడీ సర్కార్ ఉందా అని కాంగ్రెస్ నేత చిదంబరం ప్రశ్నించారు. బీజేపీ నేతల వ్యాఖ్యల్ని చిదంబరం తీవ్రంగా తప్పుబట్టారు. జార్జో సోరోస్ వ్యాఖ్యలు భారత్ లో ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం అంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు. 92 ఏళ్ల ధనిక విదేశీ పౌరుడి విచ్చలవిడి ప్రకటనతో పడిపోయింత బలహీనంగా మోడీ ప్రభుత్వం ఉందా అని చిదంబరం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు.

congress leader chidambaram slams bjp leader attack over george soros remarks on pm modi
భారత ప్రభుత్వంలో ఎవరు ఉండాలో, ఎవరు బయట ఉండాలో భారత ప్రజలే నిర్ణయిస్తారని చిదంబరం తన ట్వీట్లో తెలిపారు. జార్జ్ సోరోస్‌ను వదిలేయండి, నౌరియల్ రౌబినీని వినండి అన్నారు. భారతదేశం పెద్ద ప్రైవేట్ సమ్మేళనాలతో ఎక్కువగా నడుస్తోందని, ఇది పోటీకి ఆటంకం కలిగిస్తుందని, కొత్తగా వ్యాపారాల్లో ప్రవేశించేవారిని చంపగలదంటూ రౌబినీ చేసిన హెచ్చరికల్ని చిదంబరం ప్రస్తావించారు. జార్జ్ సోరోస్ గతంలో చెప్పిన వాటిలో చాలా వరకు తాను ఏకీభవించలేదని, ఇప్పుడు అతను చెప్పే చాలా వాటితో నేను ఏకీభవించనని చిదంబరం తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+