తల్లి సెంటిమెంట్ తో రాహుల్ గాంధీ ఎంట్రీ, రివర్స్ గేర్ వేస్తున్న గాలి జనార్దన్ రెడ్డి, మైనింగ్ అడ్డా !

కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ శుక్రవారం జరుగుతోంది. లోక్ సభ ఎన్నికల పోలింగ్ సందర్బంగా బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలోని 14 లోక్ సభ నియోజక వర్గాల్లో పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో కర్ణాటకలో రెండో విడత పోలింగ్‌ జరగనున్న 14 లోక్ సభ నియోజకవర్గాల్లో జోరుగా ఎన్నికల ప్రచారం సాగుతోంది.

కర్ణాటకలో లోక్ సభ ఎన్నికల ప్రచారం చెయ్యడానికి ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీలతో పాటు జాతీయ స్థాయి నాయకులు కర్ణాటకకు తరలివస్తున్నారు. కర్ణాటకలో మే 7వ తేదీ మంగళవారం రెండో విడత పోలింగ్ జరగనుంది. కర్ణాటకలోని హాట్ లోక్ సభ నియోజకవర్గాల్లో ఒక్కటి అయిన బళ్లారిలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. బళ్లారి కాంగ్రెస్ అభ్యర్థి తుకారాంను గెలిపించడం కోసం ఎన్నికల ప్రచారానికి రాహుల్ గాంధీ స్వయంగా వస్తున్నారు.

Congress leader Rahul Gandhi is coming to Bellary to campaign for the Lok Sabha elections

కర్ణాటకలో తొలిదశ పోలింగ్ జరుగుతున్న ఏప్రిల్ 26వ తేదీన బళ్లారిలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. బళ్లారికి సోనియా గాంధీ కుటుంబానికి లింక్ ఉంది. ఇదే బళ్లారిలో సోనియా గాంధీ ఎంపీగా గెలుపొందారు బళ్లారి లోక్ సభ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. బళ్లారిలో మే 7వ తేదీన జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం చెయ్యనున్నారు.

బళ్లారి లోక్ సభ నియోజక వర్గంలో పోటీ చేసిన సోనియా గాంధీ ఎంపీగా గెలిచారు. 1999లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బళ్లారి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సోనియా గాంధీ గెలుపొందారు. ఇలా సోనియా గాంధీ కుటుంబానికి, బళ్లారికి సంబందం ఉంది. అందుకే తన తల్లిని గెలిపించిన బళ్లారి ప్రజలు ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ఎన్నికల ప్రచారం చెయ్యడానికి రాహుల్ గాంధీ బళ్లారికి వస్తున్నారు.

1999లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో సోనియా గాంధీ 56,000 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి సుష్మా స్వరాజ్‌పై విజయం సాధించారు. 1999 లోక్ సభ ఎన్నికల్లో సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్ బళ్లారి నుంచి పోటీ చేయడంతో బళ్లారి జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పట్లో సోనియా గాంధీని ఓడించడానికి బళ్లారిలో గాలి జనార్దన్ రెడ్డి సోదరులతో పాటు బళ్లారి శ్రీరాములు, బీజేపీ నాయకులు అనేక ప్రయత్నాలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+