వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజస్థాన్ కాంగ్రెస్ సర్కారుకు షాక్ తప్పదా?: రాజీనామాలు చేస్తున్న సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలు

|
Google Oneindia TeluguNews

జైపూర్/న్యూఢిల్లీ: రాజస్థాన్ రాజకీయాలు గంటగంటకు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. మంగళవారం జరిగిన సీఎల్పీ సమావేశానికి సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలు, మంత్రులు గైర్హాజరయ్యారు. ఇప్పటికే పలుమార్లు కాంగ్రెస్ పెద్దలు సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నించినా విఫలం కావడంతో చివరకు సచిన్ పైలట్‌ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించారు. పీసీసీ చీఫ్ పదవి నుంచి కూడా తొలగిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. అంతేగాక, సచిన్ కు మద్దతు పలికిన ఇద్దరు మంత్రులను కూడా తొలగించింది.

మధ్యప్రదేశ్‌ని ఇక్కడా రిపీట్ చేయాలని..

మధ్యప్రదేశ్‌ని ఇక్కడా రిపీట్ చేయాలని..


ఇక రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్.. సచిన్ పైలట్, బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ ఆడించినట్లు సచిన్ పైలట్ ఆడుతున్నారని అన్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో చేసిన పనిని రాజస్థాన్‌లోనూ చేయాలని ఆ పార్టీ చూస్తోందని మండిపడ్డారు.

సచిన్ వర్గానికి అన్ని అవకాశాలిచ్చినా..

సచిన్ వర్గానికి అన్ని అవకాశాలిచ్చినా..

సచిన్ పైలట్‌కు, ఆయన మద్దతుదారులకు అన్ని అవకాశాలు కల్పించామని, అయినా సీఎల్పీ భేటీకి వారు హాజరుకాలేదని సీఎం గెహ్లాట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుగుబాటు చేస్తున్న నేతల డిమాండ్లకు తాము అంగీకరించినప్పటికీ.. వారు మాత్రం పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

సచిన్ బీజేపీ చేతిలో కీలుబొమ్మగా..

సచిన్ బీజేపీ చేతిలో కీలుబొమ్మగా..


ప్రస్తుతం సచిన్ పైలట్ చేతుల్లో ఏమీలేదు. బీజేపీ ఆడించినట్లు ఆడుతున్నారు. బీజేపీ రిసార్టు రాజకీయాలు నడుపుతోందని, ఎమ్మెల్యేల కొనుగోళ్లకు పాల్పడటం చాలా బాధాకరమని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం తీవ్రమైన ముప్పులో ఉందన్నారు గెహ్లాట్. తమ ప్రభుత్వాన్ని పడగొట్టే బీజేపీ కుట్రలో సచిన్ భాగమయ్యారని గెహ్లాట్ ఆరోపించారు.

Recommended Video

Rajasthan Political Crisis : వేడెక్కిన రాజస్తాన్ రాజకీయం..పూర్తి మద్దతు Ashok Gehlotకే ..!
రాజీనామాలు చేస్తున్న సచిన్ వర్గం ఎమ్మెల్యేలు

రాజీనామాలు చేస్తున్న సచిన్ వర్గం ఎమ్మెల్యేలు

కాగా, సచిన్ పైలట్ మద్దతుదారులైన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా రాజీనామాలకు సిద్ధమయ్యారు. పీసీసీ సెక్రటరీలు ప్రశాంత్ సహదేవ్ శర్మ, రాజేష్ చౌదరి తమ పదవులకు రాజీనామా చేశారు. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని మైనార్టీలో పడేసేందుకు ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని సచిన్ వర్గం స్పష్టం చేస్తుండటం గమనార్హం.

English summary
Congress MLAs who are supporting Sachin Pilot have started tendering their resignations. PCC secretaries Prashant Sahadev Sharma and Rajesh Chaudhary have tendered their resignations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X