Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గాలి జనార్దన్ రెడ్డి బ్యాచ్ కు చెక్ పెట్టాలని స్కెచ్, సీన్ లోని నాగ్, మంత్రి పదవి !

బెంగళూరు/బళ్లారి: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆలస్యం చెయ్యకుండా పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పాటు చెయ్యాలని సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అనుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో సీఎం సిద్దరామయ్య, డీకే. శివకుమార్ చర్చలు జరిపారు. 60 మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఆశిస్తూ ఢిల్లీలో మకాం వేశారు.

శుక్రవారం మరోసారి సిద్దరామయ్య, డీకే. శివకుమార్ తో చర్చలు జరపాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అనుకుంది. అయితే గురువారం అర్దరాత్రి డీకే. శివకుమార్ ఢిల్లీ నుంచి బయలుదేరి బెంగళూరు వచ్చేశారు. తన ఇంటిలో చిన్న శుభకార్యం ఉందని, అందుకే తాను బెంగళూరు వచ్చేశానని డీకే. శికుమార్ అంటున్నారు. ఢిల్లీలోనే మకాం వేసిన సిద్దరామయ్య శుక్రవారం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో మరోసారి చర్చలు జరపనున్నారు.

 galinagendrasriramulu

బళ్లారి గ్రామీణ నియోజక వర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన బి. నాగేంద్రకు సిద్దరామయ్య మంత్రి వర్గంలో చోటు దక్కిందని తెలిసింది. బీజేపీ మాస్ లీడర్, అప్పటి బీజేపీ మంత్రి బళ్లారి శ్రీరాములు మీద భారీ మెజారిటీతో నాగేంద్ర విజయం సాధించి ఎమ్మెల్యే అయ్యారు. బళ్లారి జిల్లా నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం ఆశపడుతున్నా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మాత్రం నాగేంద్రకు మంత్రి పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యిందని తెలిసింది.

బళ్లారిలో గాలి జనార్దన్ రెడ్డి వర్గంతో, బళ్లారి శ్రీరాములు వర్గంతో పోటీ పడి ఎమ్మెల్యేగా గెలిచిన నాగేంద్రకు మంత్రి పదవి వస్తే తరువాత పరిస్థితులు వేరుగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో నాగేంద్ర, ప్రస్తుతం బీజేపీలో ఉన్న మాజీ మంత్రి ఆనంద్ సింగ్ బెంగళూరు నగర శివార్లలోని రిసార్టులో ముష్టియుద్దానికి దిగా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుని పోలీసు కేసులు పెట్టుకునే వరకు వెళ్లారు.

 gali-janardhan-reddy-

ఇప్పుడు ఆనంద్ సింగ్ ఎమ్మెల్యే కూడా కాదు. గాలి సోమశేఖర్ రెడ్డి, గాలి కరుణాకర్ రెడ్డి, బళ్లారి శ్రీరాములు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఇలాంటి సమయంలో బళ్లారిలో కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చెయ్యాలని డిసైడ్ అయిన కాంగ్రెస్ పార్టీ నాగేంద్రకు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించిందని తెలిసింది. మొత్తం మీద బళ్లారిలో నాగేంద్రకు మంత్రి పదవి ఇస్తే తరువాత ఆ జిల్లాలో లెక్కలు తారుమారు అవుతాయని తెలిసింది.

అయితే బళ్లారిలో గాలి జనార్దన్ రెడ్డి బ్యాచ్ తో, బళ్లారి శ్రీరాములు వర్గంతో ఢీకొట్టే స్థాయి నాగేంద్రకు లేదని స్థానికులు అంటున్నారు. ఎందుకంటే గతంలో నాగేంద్ర కూడా గాలి జనార్దన్ రెడ్డి అనుచరుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బళ్లారి జిల్లాలకు గాలి జనార్దన్ రెడ్డి దూరంగా ఉన్నా ఆయన వర్గం మాత్రం బళ్లారిలో బలంగానే ఉందని ఇప్పటికే అనేకసార్లు వెలుగు చూసింది.

గాలి జనార్దన్ రెడ్డి ఫ్యామిలీలోనే ఇద్దరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడటంతో బళ్లారి సిటీలో కాంగ్రెస్ పార్టీ గెలిచిపోయింది. బళ్లారి గాలి జనార్దన్ రెడ్డి ఫ్యామిలీకి కంచుకోట అని తెలిసిందే. అయితే నాగేంద్రకు మంత్రి పదవి వచ్చి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఆయనకు ఏ ఖాతా వస్తుందో చూసిన తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయో కొన్ని రోజులు వేచి చూడాలని బళ్లారి ప్రజలు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+