జార్ఖండ్‌ 'చే'జిక్కేనా..?

మరికొద్ది రోజుల్లో జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చావో రేవో అని చెప్పాలి. జార్ఖండ్ రాష్ట్రంలో అధికారం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జార్ఖండ్ కూడా ఒకటి. అయితే కాలక్రమేపి రాష్ట్రంలో కాంగ్రెస్ హవా తగ్గిపోతూ వచ్చింది. ముఖ్యంగా శిబు సోరెన్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుకు గండి కొట్టారు. ఇక త్వరలో జరగబోయే ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పెద్దగా ఆశలు పెట్టకున్నట్టు కనిపించడం లేదు. ఇప్పటికే అక్కడి పార్టీ పరిస్థితి ఏం బాలేదని నేతలు చెబుతున్నారు. అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టమనే సంకేతాలు అందుతున్నాయి. భారీ అంచనాలు మధ్య అధికారం చేపట్టిన హేమంత్ సోరెన్‌.. ఆ అంచనాలు అందుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తన తండ్రి శిబు సోరెన్ రాజకీయ వారసత్వంతో అధికారంలోకి వచ్చిన హేమంత్ సోరెన్‌ అన్ని రంగాల్లో విఫలం చెందారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఇదే సమయంలో సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్‌ అరెస్ట్ కావడం ఆ పార్టీకి పెద్దగా మైనస్‌గా మారింది. మనీ లాండరింగ్‌ కేసులో ఆయన కొన్నాళ్లు జైలు జీవితం గడిపారు. ఇదే సమయంలో పార్టీలో చోటు చేసుకున్న అంతర్గత విభేదాలు సైతం హేమంత్ సోరెన్‌‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. మరోవైపు కేంద్రంలో ఉన్న బీజేపీపై కూడా కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇటువంటి తరుణంలో కచ్చింతంగా రేసులో ఉండాల్సిన కాంగ్రెస్ పార్టీ, అంతర్గత కుమ్ములాటలతో మునిగిపోయింది. నేతల మధ్య సఖ్యత కుదరడం లేదు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇప్పటికే పలుమార్లు రాష్ట్రంలో పర్యటించి పార్టీని బలోపేతం చేయడానికి చేసిన ప్రయత్నాలు ఏమీ ఫలించినట్టు కనిపించడం లేదు.

Congress party internal conflicts in the state of Jharkhand

ఎటువంటి వ్యూహాలు లేకుండా కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్తొందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఫెయిల్ అయినట్టే కనిపిస్తోంది. పార్టీలో చోటు చేసుకున్న అంతర్గత విభేదాలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. మరోవైపు ఈసారి ఎలాగైనా జార్ఖండ్‌లో పాగా వేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. బీజేపీ ఆ దిశగా ప్రయత్నాలు సైతం మొదలుపెట్టింది. గత ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన గిరిజన ఓటర్లను తమవైపు తిప్పుకోవడంలో బీజేపీ సక్సెస్ అయిందనే చెప్పాలి.గత ఎన్నికల్లో తృటిలో చేజారిన విజయాన్ని ఈసారి ఎలాగైనా చేజిక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేసింది. పైగా జార్ఖండ్‌లో తన పరిధిని విస్తరించడానికి ప్రాంతీయ పార్టీలతో పొత్తులను కూడా చురుకుగా కొనసాగిస్తోంది. ఇన్ని ప్రతికూలతలను దాటుకుని జార్ఖండ్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+