సీఎం రేసులో ఉన్న లీడర్ కు కేసుల భయం, క్లైమాక్స్ లో ఐశ్వర్య ఔట్, తమ్ముడు ఎంట్రీ !

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోరు ఏరైంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇప్పుడు ఒకేఒక్క నియోజక వర్గం మీద అందరి కన్నుపడింది. సీఎం అభ్యర్థి రేసులో ఉన్న డీకే. శివకుమార్ పోటీ చేస్తున్న కనపురలోనే ఆయన తమ్ముడు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ డీకే. సురేష్ చివరి నిమిషంలో నామినేషన్ వెయ్యడంతో కన్నడిగులు షాక్ అయ్యారు.

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వెయ్యడానికి గురువారం చివరి రోజు. గురువారం మద్యాహ్నం వరకు బెంగళూరులోని పధ్మనాభనగర్ నియోజక వర్గంలో డీకే శివకుమార్ తమ్ముడు డీకే. సురేష్ పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే గురువారం సైలెంట్ గా కనకపురకు వెళ్లిన డీకే. శివకుమార్ ఆ నియోజక వర్గం నుంచి నామినేషన్ వెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

 Congress Party MP DK, Suresh who filed nomination as Congress Party candidate in Kanakapura.

కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ మీద ఇప్పటికే సీబీఐ, ఈడీ కేసులు నమోదు కావడంతో ఆయన నామినేషన్ ను ఎన్నికల అధికారులు తిరస్కరిస్తారనే భయం కాంగ్రెస్ హైకమాండ్ కు పట్టుకుంది. డీకే. బ్రదర్స్ కుంచుకోట అయిన కనకపుర నియోజక వర్గం చెయ్యిదాటి పోకుండా చాడాలని డీకే శివకుమార్ అనుకున్నారు.

డీకే శివకుమార్ కుమార్తె డీకే. ఐశ్వర్య కనకపుర నుంచి పోటీ చేస్తారని గురువారం మద్యాహ్నం వరకు అందరూ అనుకున్నారు. అయితే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎవ్వరూ ఊహించని విధంగా డీకే. సురేష్ కనకపుర నియోజక వర్గం నుంచి పోటీలో దిగడంతో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం షాక్ అయ్యారు.

డీకే. శివకుమార్ నామినేషన్ ను ఎన్నికల అధికారులు తిరస్కరించినా కనకపురలో అదే ఫ్యామిలీ నుంచి పోటీ చెయ్యడానికి డీకే. సురేష్ స్వయంగా రంగంలోకి దిగడం హాట్ టాపిక్ అయ్యింది. పలు కేసుల్లో చిక్కుకున్న డీకే. శివకుమార్ అసెంబ్లీ ఎన్నికల తరువాత కచ్చితంగా జైలుకు వెలుతారని, సీబీఐ, ఈడీ అధికారులు అరెస్టు చేస్తారని కొందరు బీజేపీ నాయకులు అప్పుడే ప్రచారం ముమ్మరం చేశారు. మొత్తం మీద కనకపుర నియోజక వర్గం నుంచి డీకే బ్రదర్స్ ఇద్దరూ నామినేషన్లు వెయ్యడంతో క్లైమాక్స్ లో ఎవరు పోటీలో ఉంటారు అనే విషయం ఇప్పుడు ఉత్కంఠగా మారిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+