బీసీ పాటిల్‌కు బీజేపీ భారీ ఆఫర్, హామీ: మరో ఆడియో రిలీజ్ చేసిన కాంగ్రెస్

Recommended Video

    కాంగ్రెస్ MLA BC పాటిల్‌ తో యడ్యూరప్ప మాట్లాడిన ఆడియో టేప్ లీక్

    బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం శనివారం సాయంత్రం 4గంటలకు బలపరీక్ష ఎదుర్కోనున్న నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తోందని కాంగ్రెస్, జేడీఎస్ ఆరోపణలు చేస్తున్నాయి. అంతేగాక, ఇందుకు సంబంధించిన ఆడియో టేపులను కూడా విడుదల చేస్తున్నాయి.

    ఇప్పటికే బీజేపీ నేతలు యడ్యూరప్ప, ఆయన కుమారుడు, గాలి సోదరులకు సంబంధించినవంటూ ఆడియో టేపులను విడుదల చేసిన కాంగ్రెస్.. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములు, ఆ పార్టీ నేత మురళీధరరావు కూడా తమ ఎమ్మెల్యేను ప్రలోభపెట్టారని, అందుకు సంబంధించిన ఆడియోను విడుదల చేసింది.

    Congress releases another tape alleging that Sriramalu & Murlidhar Rao trying to bribe MLa BC Patil

    తమ ఎమ్మెల్యే బీసీ పాటిల్‌ను భారీ మొత్తం సొమ్ము ఇస్తామని, అలాగే స్పీకర్ కూడా అనర్హత వేటు వేయకుండా చూసుకుంటామని ప్రలోభపెట్టారని కాంగ్రెస్ ఆరోపించింది. ఇది బీజేపీ పెద్ద మనుషులు చేసేపనంటూ విమర్శలు చేసింది.

    కాగా, ఈ ఆడియో టేపు నకిలీదన్న బీజేపీ.. కాంగ్రెస్ ఆరోపణలను కొట్టిపారేసింది. తమ పార్టీ ఎమ్మెల్యేలనే కాంగ్రెస్, జేడీఎస్ ప్రలోభ పెడుతున్నాయని బీజేపీ ఆరోపించింది. శనివారం సాయంత్రం 4గంటలకు బలపరీక్ష నిర్వహించనున్న విషయం తెలిసిందే.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+