హీరోయిన్‌ను రూమ్‌కు రావాలంటూ మెసేజ్ పెట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే..క్లైమాక్స్ అదిరింది..!
నటి రిని జార్జ్‌కు మలయాళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. గతంలో ఆమె జర్నలిస్ట్‌గా కూడా పని చేశారు. ఆమె తాజాగా ఓ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల కేరళలోని ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు తనను వేధించారని, అసభ్యకరమైన సందేశాలు పంపించారని ఆరోపణలు చేయడంతో ఆమె వార్తల్లో నిలిచారు.
ఆమె ఆరోపణల ప్రకారం... ఆ రాజకీయ నాయకుడు ఆమెకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపి, హోటల్‌కు రమ్మని ఆహ్వానించారు. ఈ విషయాన్ని తాను ఆ పార్టీ సీనియర్లకు తెలియజేసినా పట్టించుకోలేదని రిని తెలిపారు. అయితే ఆమె ఆ రాజకీయ నాయకుడి పేరు చెప్పలేదు. అయినప్పటికీ, ఈ వివాదం కేరళ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

అయితే, బీజేపీ మాత్రం కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటత్తిల్ పేరును తెరపైకి తెచ్చింది. బీజేపీ నాయకులు ఆ వేధింపులకు పాల్పడింది రాహుల్ అని ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. రిని జార్జ్‌ను లైగింకంగా వేధించింది రాహుల్ అని ఆరోపించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న రాహుల్ యూత్ కాంగ్రెస్ పదవికి రాజీనామా చేశారు.
అయితే, రాహుల్ తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. నాపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తి వాటిని కోర్టు ద్వారా నిజం అని నిరూపించాలి. ఇప్పటివరకు నాపై ఎక్కడా కూడా పోలీస్ కేసు నమోదు కాలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఈ వివాదంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్పందించింది. రాహుల్ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.ప్రస్తుతం ఈ విషయం కేరళ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications