వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ విడుదలపై కాంగ్రెస్: బాబు ఎప్పుడెవరితో ఉంటారో

By Srinivas
|
Google Oneindia TeluguNews

Congress welcomed Jagan's release
న్యూఢిల్లీ: ఎవరు జైల్లో ఉన్నా కాంగ్రెసు పార్టీకి సంతోషం కాదని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని స్వేచ్ఛను ఆస్వాదించనివ్వండని కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి పిసి చాకో అన్నారు. ఆస్తుల కేసులో అరెస్టైన జగన్ మంగళవారం చంచల్ గూడ జైలు నుండి విడుదలైన విషయం తెలిసిందే. దీనిపై పిసి చాకో మరోసారి స్పందించారు.

జగన్ తన స్వేచ్ఛను ఆస్వాదించనివ్వాలని, ఎవరు జైల్లో ఉన్నా తమకు సంతోషం కాదని, తమది ప్రజాస్వామిక పార్టీ అని చెప్పారు. జగన్ విడుదలతో తమకు సంబంధం లేదని, చట్టం తన పని తాను చేసుకు పోతోందన్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కుమ్మక్కయ్యాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల పైనా ఆయన స్పందించారు.

జగన్‌తో పొత్తు విషయమై స్పందిస్తూ.. ఎన్నికలు చాలా దూరంలో ఉన్నాయని, తేలాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయన్నారు. మొదట చంద్రబాబు ఎవరితో కుమ్మక్కయ్యారో చెప్పాలన్నారు. పొద్దున భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌తో, సాయంత్రం లెఫ్ట్ నేత ప్రకాశ్ కారత్‌తో ఉంటారని, అసలు ఆయన ఎవరితో ఉన్నారనే విషయమై ప్రజలకు ఎక్కువ ఆసక్తి అని ఎద్దేవా చేశారు.

కాగా, జైల్లో ఉన్నా.. బయట ఉన్నా అందరూ తమకు మద్దతు పలకాల్సిందేనని ఏఐసిసి అధికార ప్రతినిధి పిసి చాకో సోమవారం అన్న విషయం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓ వైపు ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌కు క్లీన్ చిట్, మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావడం కాకతాళీయం అనుకోవచ్చా అని విలేకరులు ప్రశ్నించినప్పుడు చాకో స్పందించారు. దేశ పరిస్థితుల్లో ఎక్కువ మంది కాంగ్రెసుకే మద్దతు పలుకుతారని చెప్పారు.

వాళ్లు జైల్లో ఉన్నా, బయట ఉన్నా తమతో వ్యతిరేకించినా, సఖ్యతగా ఉన్నా ఎన్నికల తర్వాత అందరూ కాంగ్రెసుకు మద్దతు పలుకుతారని ధీమా వ్యక్తం చేశారు. ఏ ముద్దాయి అయినా బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చునని చెప్పారు. దానిపై కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ ఆమోదించాల్సిందే అన్నారు. బెయిల్‌పై ప్రశ్నకు బదులిస్తూ.. తాను దానిపై మాట్లాడదల్చుకోలేదన్నారు.

విభిన్న విషయాలను ఒక్కటిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని, అందుకు తాను సహకరించదల్చుకోవడం లేదన్నారు. దేశ పరిస్థితుల్లో ఎక్కువ మంది కాంగ్రెసుకు మద్దతు పలుకుతారని, బిజెపికి కాదన్నారు. ఎన్నికల తర్వాత ఎవరైనా జైల్లో ఉన్నా, బయట ఉన్నా, తమతో విభిదించినా, సఖ్యతగా ఉన్నా అంతా కాంగ్రెసుకు మద్దతివ్వాల్సిందే అన్నారు. జగన్ తమకు మద్దతిస్తున్నారని మీరే చెబుతున్నారని, ఆయన ఏదో ఒకవైపు తప్పితే రెండు వైపులకు వెళ్లడం సాధ్యం కాదన్నారు. అయితే, పొత్తుల గురించి ఇప్పుడే మాట్లాడటం సరికాదన్నారు.

English summary

 AICC spokesperson Chacko said on Tuesday that It's not proper to discuss tie-up with YSR Congress Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X