మూడు నెలల క్రితం పెళ్లి, 250 సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తే ?, యూనివర్శిటీ క్యాంపస్ లో ?

ఐదు రోజుల క్రితం అదృశ్యమైన బెంగళూరులోని మడివాళ పోలీస్ స్టేషన్‌కు చెందిన కొత్తగా పెళ్లయిన పోలీస్ కానిస్టేబుల్ ఈరోజు జ్ఞానభారతి సమీపంలోని పాడుబడిన బావిలో శవమై కనిపించాడు.
కొత్తగా పెళ్లయిన పోలీస్ కానిస్టేబుల్ శివరాజ్ అతని భార్యతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

మూడు నెలల క్రితమే వాణి అనే యువతిని పోలీసు శివరాజ్ అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు. బెంగళూరులోని మడివాల పోలీస్‌ లో శివరాజ్ కానిస్టేబుల్‌ గా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే శివరాజ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా మృతదేహం కోసం పోలీసులు గాలించారు. శివరాజ్ మృతదేహం ఆచూకీ కోసం 250కి పైగా సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు.

Constable committed suicide in Bengaluru University campus

మడివాల్ పోలీస్ కానిస్టేబుల్ శివరాజ్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తూ అతని అన్న కుమారుడు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు శివరాజ్ శవం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శివరాజ్‌ శవం కోసం బెంగళూరులోని సుబ్రమణ్యపూర్ పోలీసులు, మడివాళ పోలీసులు వెతికారు. శివరాజ్ ఆచూకీ కోసం పలు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఐదు రోజుల పాటు వెతికిన తర్వాతే శివరాజ్ మృతదేహం లభ్యమైంది.

మెట్రో స్టేషన్ దగ్గర బైక్ పార్క్ చేసి శివరాజ్ ఎక్కడికి వెళ్లాడో తెలియలేదు. వాటర్ బాటిల్ తో బెంగళూరు విశ్వవిద్యాలయం ఆవరణం లోపలికి వెళ్లినట్లు మాత్రమే తెలిసింది. దీని ఆధారంగా చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. మైసూరు రోడ్డులోని సుబ్రణ్యపుర నుంచి జ్ఞానభారతి మెట్రో స్టేషన్ వరకు సుమారు 250 సీసీటీవీలను పరిశీలించారు వాటి క్లిప్పింగ్స్ ను పరిశీలించారు. కానీ అతను ఎక్కడా కనిపించలేదు.

శివరాజ్ మృతదేహం బెంగుళూరు విశ్వవిద్యాలయం ఆవరణలోని ఒక పాడుబడిన బావిలో తేలుతూ కనిపించింది. అనంతరం పోలీసులు శివరాజ్ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు. సీసీటీవీ ఫుటేజీలో శివరాజ్ బెంగళూరు యూనివర్శిటీ లోపల ఒంటరిగా నడుస్తూ వెలుతున్న సమయంలో రికార్డు అయ్యింది. దీంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా శివరాజ్ కేసు హత్య కాదని, ఆత్మహత్య అని నిర్ణయానికి వచ్చారు. పెళ్లయిన మూడు నెలలకే శివరాజ్ కు అతని భార్య వాణి దూరమైంది.

Constable committed suicide in Bengaluru University campus

కుటుంబ గోడవల కారణాలతోనే శివరాజ్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. శివరాజ్ మూడు నెలల క్రితమే వాణిని పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లయిన తర్వాత భార్య వాణఇ శివరాజ్ కు దూరమైంది. కుటుంబ కలహాల కారణంగా శివరాజ్‌తో పాటు అతని కుటుంబంపై దావణగెరె పోలీస్ స్టేషన్‌లో వాణి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేయడమే కాకుండా శివరాజ్ ను నీ అంతు చూస్తానని భార్య వాణి బెదిరించిందని తెలిసింది.

డ్యూటీకి వెళ్లిన శివరాజ్ కనిపించకుండా పోయాడని, భార్య వాణి వేధింపులతో విసిగిపోయాడని శివరాజ్ సోదరుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. తరువాత కనపడకుండా పోయిన కానిస్టేబుల్ శివరాజ్ పాడుపడిన బావిలో శవమై కనిపించాడు. శివరాజ్ మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు, ఎఫ్‌ఎస్‌ఎల్‌ బృందం సంఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. ఖాళీ బావిలో పడి ఉన్న శివరాజ్ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+