ఖా‘కీచకుడు’:బాధితురాలిపై లైంగికదాడి, మూడేళ్ల నుంచి..
న్యాయం చేయాలని కోరడమే ఆమె పాపమైపోయింది. పోలీసులను ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుందని అనుకుంది.. కానీ ఆ ఖాకీ మాత్రం తన నీచబుద్దిని చూపించాడు. బాధిత మహిళపై లైంగికదాడి చేశాడు. ఈ ఘటన గుజరాత్‌లో వెలుగుచూసింది. భర్త బాధ నుంచి రక్షించాల్సిన కానిస్టేబుల్ మహిళలై లైంగిక దాడి చేశాడు. వరకట్న వేధింపులు ఎదుర్కొంటున్న మహిళ.. పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయటానికి వెళితే ఆమెను లోబరుచుకుని లైంగికంగా వేధించాడు.
అహ్మదాబాద్‌లో నివసించే మహిళ మాజీ భర్తపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేయడానికి వెళ్లింది. ఇప్పుడు కాదు.. మూడేళ్ల క్రితం స్ధానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. మహిళ వద్ద ఫిర్యాదు తీసుకున్న అక్కడ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ నిందితుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించాడు.

దర్యాప్తులో భాగంగా ఆ కానిస్టేబుల్ మహిళతో పలుమార్లు ఫోన్లో మాట్లాడుతూ పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆ మహిళను పలుమార్లు వ్యక్తిగతంగా కలిసి మాట్లాడి మహిళను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి లోబరుచుకున్నాడు. పెళ్లి పేరుతో మూడేళ్లలో తనపై పలుమార్లు లైంగిక దాడి చేసినట్లు మహిళ తన ఫిర్యాదులో పేర్కోంది.
అహ్మదాబాద్‌లోని ఒక హోటల్‌లో తనతో గడపాలని కూడా కోరాడని, హోటల్‌లో తనపై లైంగిక దాడి చేశాడని కూడా మహిళ ఆరోపించింది. అత్యాచారం చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు మే నెలలో తనపై దాడిచేసి కొట్టాడని ఆరోపించింది. ఆ సమయంలో కేసు విత్ డ్రా చేసుకునేందుకు తనకు డబ్బులు ఇవ్వచూపాడని ఆమె ఆరోపించింది. మహిళ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376-ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications