Cooker bomb: షారిఖ్ కు పలువురి ఆర్థిక సహాయం ?, 40 మంది విచారణ, బ్యాంక్ అకౌంట్స్ పై ఆరా !
బెంగళూరు/మంగళూరు/చెన్నై: కర్ణాటకలోని మంగళూరు సిటీలో జరిగిన కుక్కర్ బాంబు పేలుడులో తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనుమానిత ఉగ్రవాది మోహమ్మద్ షారిఖ్ ను పోలీసులు వరుసగా మూడోరోజు విచారణ చేశారు. అనుమానిత ఉగ్రవాదికి పలు రాష్ట్రాల నుంచి ఆర్థిక సహాయం అందిందని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఇప్పటికే ఈ విషయంలో 40 మందికిపైగా విచారణ చేశారని వెలుగు చూసింది.

కుక్కర్ బాంబు పేలుడు
మంగళూరులో ఇటీవల ఆటోలో కుక్కర్ బాంబు పేలిపోయిన విషయం తెలిసిందే. ఓ ప్రాంతంలో కుక్కర్ బాంబు పేల్చడానికి మోహమ్మద్ షారిఖ్ అలియాస్ షారిఖ్ ప్రయత్నించాడు. షారిఖ్ ఆటోలో కుక్కర్ బాంబు తీసుకు వెలుతున్న సమయంలో అదిఅనుకున్న టైమ్ కంటే ముందుగా పేలిపోయింది.

విచారణకు సహకరించలేదు
కుక్కర్ బాంబు పేలుడులో తీవ్రగాయాలైన షారిఖ్ మంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తీవ్రగాయాలైన షారిఖ్ చాలా నిదానంగా కోలుకుంటున్నాడు. కర్ణాటకలోని మంగళూరు సిటీలో జరిగిన కుక్కర్ బాంబు పేలుడులో తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనుమానిత ఉగ్రవాది షారిఖ్ ను పోలీసులు వరుసగా మూడోరోజు విచారణ చేశారు.

షారిఖ్ కు ఆర్థిక సహాయం..... బ్యాంక్ అకౌంట్ లు
మోహమ్మద్ షారిఖ్ కు తమిళనాడు, మధ్యప్రదేశ్, జార్ఖండ్ తదితర ప్రాంతాల నుంచి ఆర్థిక సహాయం అందుతోందని పోలీసు అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. షారిఖ్ బ్యాంక్ అకౌంట్ లు, తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అతనికి అందుతన్న ఆర్థిక సహాయం గురించి పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.

మైసూరులో 40 మంది విచారణ
షారిఖ్ తో టచ్ లో ఉన్న సుమారు 40 మందిని పోలీసు అధికారులు విచారణ చేసి వివరాలు సేకరించారు. మైసూరు ప్రాంతంలో షారిఖ్ గురించి పోలీసులు అనేక మందిని విచారణ చేశారని వెలుగు చూసింది. షారిఖ్ పూర్తిగా కోలుకున్న తరువాత పోలీసులు అతన్ని మొదట ఎన్ఐఏ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.

మ్యాటర్ మొత్తం లాగేస్తున్నారు
ఇప్పటికే మంగళూరు కుక్కర్ బాంబు కేసు ఎన్ఐఏ అధికారులకు అప్పగించాలని కర్ణాటక ప్రభుత్వం డిసైడ్ అయిన విషయం తెలిసిందే. ఎన్ఐఏ అధికారులు విచారణ చేసిన తరవాత మంగళూరు పోలీసులు షారిఖ్ ను విచారణ చెయ్యాలని సిద్దం అవుతున్నారు. ఇప్పటికే షారిఖ్ తో ఎవరెవరు టచ్ లో ఉన్నారు ? అని పోలీసు అధికారులు పూర్తి సమాచారం బయటకు లాగుతున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications