దేశానికి కరోనా భయం.. తాజాగా ఎన్ని కేసులంటే

కరోనా మహమ్మారి మళ్ళీ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది .దేశంలో మళ్ళీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో ప్రస్తుత 250కి పైగా కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్టు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో కేసులు నమోదవుతున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వైద్య సిబ్బంది అలర్ట్ అవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి.

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలోని ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక ,ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కరోనా కేసులు నమోదవుతున్న తీరు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా మహమ్మారి కేసులు నమోదవుతున్న క్రమంలో ఆయా రాష్ట్రాలలో వైద్య సిబ్బంది అలర్ట్ అయ్యారు. వ్యాక్సిన్లు, బెడ్లు,టెస్ట్ కిట్లు, ఆక్సిడెంట్ సిలిండర్లు ఇలా ప్రతి ఒక్కటి రెడీ చేసుకునే పనిలో పడ్డారు. ఇక ముఖ్యంగా దేశంలోని కేరళ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది.

corona cases rise in india new fear with latest surge in covid cases

కేరళలో భారీగా కరోనా కేసులు .. అలెర్ట్ అయిన ప్రభుత్వం
కేరళలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణ జార్జ్ అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. మాస్క్ లను ధరించాలని సూచిస్తున్నారు. ఇక కేరళ రాష్ట్రంలో అన్ని ఆసుపత్రులలో మాస్కులు ధరించడం తప్పనిసరి చేశారు. దగ్గు, జలుబు వంటి లక్షణాలతో ఎవరైనా ఆసుపత్రికి వస్తే తప్పనిసరిగా ముఖానికి మాస్క్ ధరించాలని పేర్కొన్నారు.

ఢిల్లీలో కరోనా కేసులు ఇలా.. ఆందోళన వద్దన్న మంత్రి
ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెలలో 23 కొత్త కరోనా కేసులు నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ వేరియంట్ సాధారణ ఇన్ఫ్లుఎంజా లాంటిదేనని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి పంకజ్ సింగ్ తెలిపారు. అయితే కరోనా వ్యాప్తి జరక్కుండా మాస్కులు ధరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

కర్ణాటక, ఏపీ, తెలంగాణా లలోనూ కరోనా భయం
ఇదిలా ఉంటే కర్ణాటక రాష్ట్రంలోనూ 35 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . మహారాష్ట్రలో 95 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, తెలుగు రాష్ట్రాలలోనూ కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. కేసులు పెరుగుతున్న దృష్ట్యా సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని ఆరోగ్య సిబ్బంది సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+