వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేజ్రీవాల్ కు కరోనా పరీక్షలు..రిపోర్ట్ పై ఉత్కంఠ: డయాబెటిక్ కావటంతో ఆయన ఆరోగ్యంపై టెన్షన్

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈ రోజు కరోనావైరస్ పరీక్షను నిర్వహించారు. జ్వరం మరియు గొంతు నొప్పితో బాధ పడుతున్న ఆయన ఆదివారం నుండి స్వీయ నిర్బంధంలోకి వెళ్ళారు. ఇక ఈ విషయాన్ని నిన్న అధికారికంగా నిర్ధారించారు. అధికారిక సమాచారం ప్రకారం, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోగ్యం ఈ రోజు కొంచెం మెరుగ్గా ఉన్నదని పేర్కొన్నారు .కానీ ఆయన ఆరోగ్యం విషయంలో అటు ఆప్ నాయకుల్లోనూ , ప్రజల్లోనూ ఆందోళన వ్యక్తం అవుతుంది.

కేజ్రీవాల్ కు డయాబెటిస్ ఉన్న కారణంగా కరోనాపై టెన్షన్

కేజ్రీవాల్ కు డయాబెటిస్ ఉన్న కారణంగా కరోనాపై టెన్షన్

కేజ్రీవాల్ వయసు ప్రస్తుతం 51 సంవత్సరాలు. ఆయన ఆదివారం మధ్యాహ్నం నుండి అనారోగ్యంతో ఉన్నారు . ఇక అప్పటి నుండి ఎవరినీ కలవలేదు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలోనే ఆయన సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారు . జ్వరం, గొంతు నొప్పి కరోనా వైరస్ లక్షణాలు. కాబట్టి ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. కేజ్రీవాల్ కు డయాబెటిస్ ఉన్నందున ఎక్కువ ఆందోళనగా ఉన్నట్టు ఆప్ వర్గాలు వెల్లడించాయి.

 ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం గానీ టెస్ట్ రిపోర్టులు వచ్చే అవకాశం

ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం గానీ టెస్ట్ రిపోర్టులు వచ్చే అవకాశం

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆదివారం ఉదయం తన మంత్రివర్గ సభ్యులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.గత కొన్ని రోజులుగా కరోనా కేసుల విషయంలో ఢిల్లీలో కేసులు బాగా నమోదు అవుతున్నాయి. ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించిన అధికారులు ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయానికి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నదని చెప్తున్నారు.

స్వీయ నిర్బంధంలో సీఎం కేజ్రీవాల్ .. మంత్రి మండలి సమావేశం నిర్వహించిన మనీష్ సిసోడియా

స్వీయ నిర్బంధంలో సీఎం కేజ్రీవాల్ .. మంత్రి మండలి సమావేశం నిర్వహించిన మనీష్ సిసోడియా

ఇక నిన్న ముఖ్యమంత్రి ఆరోగ్యం బాగాలేదని, స్వీయ నిర్బంధంలోకి వెళ్లారని, దగ్గు, గొంతు నొప్పితో బాధపడుతున్నారని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సోమవారం వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, సామాజిక వ్యాప్తి, ప్రైవేట్‌ దవాఖానలపై చర్చించడానికి మనీశ్‌ సిసోడియా నేతృత్వంలో ఈరోజు మంత్రిమండలి సమావేశం జరిగింది. ఇక ఢిల్లీ వాసులు ముఖ్యమంత్రి ఆరోగ్యం విషయంలో కాసింత ఆందోళనలో ఉన్నారు .

Recommended Video

Delhi CM Arvind Kejriwal Unwell, To Undergo Covid-19 Test
ఢిల్లీలో రోజు రోజుకీ పెరుగుతున్న కేసులతో ఆందోళన

ఢిల్లీలో రోజు రోజుకీ పెరుగుతున్న కేసులతో ఆందోళన

ప్రస్తుతం ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడు కరోనా కేసులు చూస్తే 29,943 కేసులు నమోదయ్యాయి. జూన్ 15 నాటికి, 44,000 కేసులు పెరిగే అవకాశం ఉంది మరియు 6,600 పడకలు అవసరం అవుతాయని ఒక అంచనా . ఇక ఇది ఇలాగే కొనసాగితే జూన్ 30 నాటికి 1 లక్ష కేసులకు చేరుకుంటామని ఢిల్లీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా కేసులు పెరుగుతున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగం అన్నిటికీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు .

English summary
Arvind Kejriwal took a coronavirus test today, sources said, a day after he went into self-quarantine following mild fever and a sore throat. Kejriwal, 51, had been unwell ,There was concern because Mr Kejriwal is diabetic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X