corona virus: కర్ణాటకలో 1, కేరళలో 2..107కి చేరిన పాజిటివ్ కేసులు..
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కర్ణాటకలో మరో పాజిటివ్ కేసు నమోదు కాగా.. కేరళలో రెండు రికార్డయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 107కి చేరుకున్నాయి. ఇప్పటికే ఇద్దరు చనిపోవడంతో భయాందోళన నెలకొంది. 12 రాష్ట్రాల్లో ప్రభావం చూపడంతో.. దాదాపు అన్ని రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు, జనసమ్మర్ధం ఉన్న చోట ప్రజలు గుమికూడొద్దని వైద్యులు సూచిస్తున్నారు. మరోవైపు వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య ఆదివారంతో 6 వేలకు చేరింది.

కర్ణాటకలోని గుల్బార్గా జిల్లాకు చెందిన ఒకరికి కరోనా వైరస్ పాజిటివ్ సోకిందని వైద్యులు పేర్కొన్నారు. ఇటు దైవభూమి కేరళలో కూడా మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 19 పాజిటివ్ కేసులు కాగా.. వాటి సంఖ్య 21కి చేరుకున్నది. ఇద్దరిలో ఒకరు బ్రిటన్ నుంచి మరొకరు విదేశాల నుంచి వచ్చారని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ తెలిపారు. ఇటు యూపీలో కూడా మరొ పాజిటివ్ కేసు రికార్డైంది. ఆగ్రాలో నమోదైన కేసుతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 13కి చేరింది. లక్నోలో కోచింగ్ సెంటర్లను ఈ నెల 22వ తేదీ వరకు క్లోజ్ చేస్తామని స్పష్టంచేసింది.
Recommended Video
జమ్ముకశ్మీర్‌లో కూడా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో ఈ నెల 31వ తేదీ వరకు రెస్టారెంట్లు మూసివేస్తున్నామని జమ్ము జిల్లా పరిపాలన విభాగం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్ షూటింగ్ ఈ నెల 31వ తేదీ వరకు నిలిపివేస్తున్నామని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయీస్ ఒక ప్రకటనలో పేర్కొన్నది. స్కూళ్లు, జిమ్, థియేటర్లు, నైట్ క్లబ్సులు మార్చి 31వ తేదీ వరకు మూసివేయాలని హర్యానా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications