వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'డెల్టా' వేరియంట్-ఒరిజినల్ కంటే డేంజర్-సెకండ్ వేవ్‌ తీవ్రతకు కారణమదే?-యూకెను వణికిస్తోంది

|
Google Oneindia TeluguNews

భారత్‌లో గుర్తించిన కోవిడ్ డెల్టా వేరియంట్ B.1.617.2 ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అలజడి రేపుతోంది. ఇటీవల ఇంగ్లాండులోని 61 శాతం శాంపిళ్లలో ఇదే వేరియంట్‌ బయటపడినట్లు అక్కడి పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్(పీహెచ్ఈ) ప్రకటించింది. గతేడాది యూకెలో బయటపడ్డ అల్ఫా వేరియంట్ B.1.1.7 కంటే డెల్టా వేరియంటే ప్రస్తుతం యూకెపై ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. ఇటీవల భారత్‌లో సెకండ్ వేవ్‌ తీవ్ర స్థాయిలో విజృంభించడానికి కూడా ఇదే వేరియంట్ కారణమని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డెల్టా వేరియంట్‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది.

Recommended Video

COVID Delta Variant : అల్ఫా కంటే 50 శాతం ఎక్కువగా డెల్టా వేరియంట్ వ్యాప్తి ! || Oneindia Telugu
భారత్‌లో బయటపడ్డ వేరియంట్...

భారత్‌లో బయటపడ్డ వేరియంట్...

గతేడాది అక్టోబర్‌లో మొదట B.1.617 వేరియంట్ బయటపడింది. దీని నుంచి మరో మూడో వేరియంట్స్‌ను గుర్తించారు. అందులో B.1.617.1, B.1.617.2,B.1.617.3 వేరియంట్స్ ఉన్నాయి. ఒరిజినల్‌తో పాటు మిగతా రెండు సబ్ వేరియంట్స్ కంటే B.1.617.2 అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని కొద్ది రోజుల క్రితం డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. అంతర్జాతీయంగా ఈ వైరస్ వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేసింది. వేరియంట్ ఆఫ్ కన్సర్న్(వీఓసీ)గా దీన్ని గుర్తించింది. ఇటీవలే దీనికి డెల్టా వేరియంట్‌గా నామకరణం చేసింది.

డెల్టా వేరియంట్ పుట్టుక...

డెల్టా వేరియంట్ పుట్టుక...

కోవిడ్ వైరస్ ఎప్పటికప్పుడు మ్యుటేషన్ ద్వారా కొత్త వేరియంట్‌గా రూపాంతరం చెందుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకూ పలు వేరియంట్స్ పుట్టుకొచ్చాయి. సాధారణంగా SARS-CoV-2 ఆర్ఎన్ఏ వైరస్‌ 30వేల అమినో యాసిడ్స్‌తో నిర్మాణం చెంది ఉంటుంది. ఇవి ఇటుకల వలే పక్కపక్కనే పేర్చినట్లుగా ఉంటాయి. ఇందులో ఎక్కడ ఏ చిన్న మార్పు సంభవించినా వైరస్ మ్యుటేషన్ చెందుతుంది. అది పూర్తిగా వైరస్ స్వభావాన్ని,రూపాన్ని మార్చేస్తుంది. అలా కోవిడ్ స్పైక్ ప్రోటీన్ పలుమార్లు మ్యుటేషన్ చెందిన తర్వాత ఈ డెల్టా వేరియంట్ అనేది పుట్టుకొచ్చింది.

ఆ నాలుగు మ్యుటేషన్లు...

ఆ నాలుగు మ్యుటేషన్లు...


డెల్టా వేరియంట్ పుట్టుకలో నాలుగు ప్రధాన మ్యుటేషన్లు కనిపిస్తున్నాయి. ఇందులో గతేడాది డెన్మార్క్‌లో బయటపడ్డ L452R,అమెరికాలో బయటపడ్డ D614G,మెక్సికోలో బయటపడ్డ T478Kతో పాటు మరో మ్యుటెంట్ P681R ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 దేశాల్లో డెల్టా వేరియంట్ వ్యాప్తిలో ఉన్నది. గత మే 17న ఇంగ్లాండులోని పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ అక్కడి వైరస్ శాంపిళ్లకు సంబంధించి జీనోమ్ సీక్వెన్సింగ్ డేటాను విశ్లేషించగా ఇందులో 61 శాతం శాంపిళ్లలో డెల్టా వేరియంట్‌ బయటపడింది. ఓవైపు అల్ఫా వేరియంట్ కేసులు క్రమంగా తగ్గుతుంటే... మరోవైపు డెల్టా వేరియంట్ విజృంభించడం ఇంగ్లాండును కలవరపెడుతోంది.

అల్ఫా కంటే డెల్టా తీవ్రత ఎక్కువ...

అల్ఫా కంటే డెల్టా తీవ్రత ఎక్కువ...

అల్ఫా వేరియంట్‌తో పోలిస్తే డెల్టా వేరియంట్ కేసుల్లో ఎక్కువమందికి ఆస్పత్రిలో చికిత్స అవసరం అవుతోందని పీహెచ్ఈ పేర్కొంది. అదే సమయంలో అల్ఫా వేరియంట్‌ కంటే డెల్టా వేరియంట్‌పై కోవిడ్ వ్యాక్సిన్ ప్రభావం కాస్త తక్కువగా ఉన్నట్లు తెలిపింది. కానీ రెండు డోసుల తర్వాత డెల్టా వేరియంట్‌పై కూడా వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు వెల్లడించింది. అల్ఫా వేరియంట్ కంటే డెల్టా వేరియంట్ 50 శాతం ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భారత్‌లో సెకండ్ వేవ్ తీవ్రతకు కారణమిదే?

భారత్‌లో సెకండ్ వేవ్ తీవ్రతకు కారణమిదే?

భారత్‌లో సెకండ్ వేవ్ అత్యంత ప్రాణాంతకంగా మారడానికి డెల్టా వేరియంటే కారణమన్న వాదన వినిపిస్తోంది. భారత్‌లో దాదాపు 12వేల పైచిలుకు వేరియంట్స్‌ను గుర్తించగా... అవేవీ అంత ప్రభావం చూపట్లేదని జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా తేలింది. కేవలం డెల్టా వేరియంట్ మాత్రమే ప్రమాదకరంగా విజృంభిస్తున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం తెలంగాణ,ఆంధ్రప్రదేశ్,గుజరాత్,మహారాష్ట్ర,ఒడిశా,ఢిల్లీ తదితర ఈ వేరియంట్‌ వ్యాప్తిలో ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.

English summary
The Public Health England (PHE) has said in its latest risk assessment of variants of coronavirus that a whopping 61% of the sequenced samples are that of the Delta variant, which was first detected in India. This means that the Delta variant has become the most dominant variant in the country, surpassing even the Alpha variant that had caused a surge of cases in the UK last year. Among the many variants of coronavirus that are present, the B.1.617 lineage
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X