Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

క్వారంటైన్ లో యువతి హీరోయిన్ లా ఉందని, అర్దరాత్రి డాక్టర్ రెండుసార్లు, పాపం పండింది, సీసీటీవీల్లో !

లక్నో/ఆలీగఢ్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికడుతూ ప్రజల ప్రాణాలు కాపాడుతున్న అందరు డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుద్ద కార్మికులు ఇప్పుడు కనిపించే దేవుళ్లు అయ్యారు. అయితే డాక్టర్లు తలదించుకునే పాడుపని ఓ డాక్టర్ చేశాడు. కరోనా పాజిటివ్ వచ్చిన 25 ఏళ్ల యువతిపై రెండుసార్లు అత్యాచారం చెయ్యడానికి విఫలయత్నం చేశాడు. అయితే కామాంధుడైన ఆ డాక్టర్ చేసిన పాడుపని మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడం, యువతి ఫిర్యాదు చెయ్యడంతో అతని పాపం పండిపోయింది. దేశంలోనే ప్రసిద్ది చెందిన ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ దారుణం జరిగింది.

 25 ఏళ్ల యువతికి కరోనా పాజిటివ్

25 ఏళ్ల యువతికి కరోనా పాజిటివ్

ఉత్తరప్రదేశ్ లోని ఆలీగఢ్ లో ప్రముఖ దీనదయాల్ ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. ఆలీగఢ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న 25 ఏళ్ల యువతి ఇటీవల ఢిల్లీ నుంచి సొంత ఊరికి వచ్చి అనారోగ్యానికి గురి కావడంతో ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించారు. యువతికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో ఆమెను దీనదయాల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి క్వారంటైన్ లోని ఐసోలేషన్ వార్డులో కరోనా వ్యాధి నయం కావడానికి చికిత్స అందిస్తున్నారు.

 ఆసుపత్రిలో డాక్టర్ కాటరాజ్

ఆసుపత్రిలో డాక్టర్ కాటరాజ్

ఆలీగఢ్ లోని దీనదయాల్ ప్రభుత్వ ఆసుపత్రిలో తాఫిల్ అహమ్మద్ (30) డాక్టర్ గా పని చేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం కావడంతో డాక్టర్ తాఫిల్ అహమ్మద్ ఆడిందేఆటగా పాడిందేపాటగా తయారైయ్యింది. కరోనా వైరస్ రోగులకు డాక్టర్ తాఫిల్ అహమ్మద్ వైద్యం చేస్తున్నాడు. చికిత్స చేసే ముసుగులో మహిళా రోగులతో డాక్టర్ తాఫిల్ అహమ్మద్ అసభ్యంగా ప్రవర్తించేవాడని తెలిసింది.

 హీరోయిన్ లా ఉన్న యువతిపై డాక్టర్ కన్ను

హీరోయిన్ లా ఉన్న యువతిపై డాక్టర్ కన్ను

దీనదాయాల్ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వ్యాధి నయం కావడానికి చికిత్స పొందుతున్న 25 ఏళ్ల యువతి చాలా అందంగా ఉంటుంది. ఆమె ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి హీరోయిన్ లా ఉంటున్న యువతి మీద కామాంధుడైన డాక్టర్ తాఫిల్ అహమ్మద్ కన్నుపడింది. వైద్యం చేసే ముసుగులో ఆమె చికిత్స పొందుతున్న క్వారంటైన్ వార్డుకు వెళ్లి వస్తున్న డాక్టర్ తాఫిల్ అహమ్మద్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు.

 చికిత్స చెయ్యరని యువతికి భయం

చికిత్స చెయ్యరని యువతికి భయం

డాక్టర్ మీద పై అధికారులకు ఫిర్యాదు చేస్తే తనకు సరైన చికిత్స అందివ్వరని, త్వరగా ఇంటికి వెళ్లడానికి అవకాశం ఉండదనే భయంతో యువతి కొన్ని రోజులు మౌనంగా ఉండిపోయింది. చిక్కింది చాన్స్ అంటూ డాక్టర్ తాఫిల్ అహమ్మద్ మరింత రెచ్చిపోయి పదేపదే యువతి చికిత్స పొందుతున్న ఐసోలేషన్ వార్డుకు వెళ్లిరావడం మొదలుపెట్టాడు.

 ఢ్యూటీ లేని టైమ్ లో అర్దరాత్రి వెళ్లి !

ఢ్యూటీ లేని టైమ్ లో అర్దరాత్రి వెళ్లి !

మంగళవారం సాయంత్రం తాఫిల్ అహమ్మద్ ఢ్యూటీ పూర్తి అయ్యింది. అయితే అతను ఆసుపత్రిలోనే మకాం వేశాడు. అర్దరాత్రి యువతి చికిత్స పొందుతున్న గదిలోకి వెళ్లిన డాక్టర్ తాఫిల్ అహమ్మద్ ఆమెపై అత్యాచారం చెయ్యడానికి విఫలయత్నం చేశాడు. యువతి కేకలు వెయ్యకుండా ఆమె నోట్లో బట్టలు కుక్కడానికి ప్రయత్నించాడు. అయితే యువతి తప్పించుకుని కేకలు వెయ్యడంతో డాక్టర్ తాఫిల్ మహమ్మద్ చిన్నగా అక్కడి నుంచి తప్పించుకున్నాడు.

 కామాంధుడు జస్ట్ మిస్

కామాంధుడు జస్ట్ మిస్

మరుసటి రోజు బుధవారం వేకువ జామున మళ్లీ యువతి గదిలోకి వెళ్లిన డాక్టర్ తాఫిల్ అహమ్మద్ మళ్లీ ఆమెపై అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించడంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. యువతి కేకలు విన్న సాటి రోగులు, ఆసుపత్రి సిబ్బంది ఆమె గదిలోకి వెళ్లడంతో మళ్లీ అక్కడి నుంచి డాక్టర్ తాఫిల్ అహమ్మద్ తప్పించుకున్నాడు. యువతి ఫిర్యాదు మేరకు ఆసుపత్రి సీనియర్ డాక్టర్లు స్థానిక క్వావర్సి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే ఓ ప్రైవేట్ హోటల్ కు వెళ్లిన డాక్టర్ తాఫిల్ అహమ్మద్ హోమ్ క్వారంటైన్ అయ్యి పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్లాన్ వేశాడు.

Recommended Video

    KCR Govt Planned For 7 Lakh Antigen Tests In The State || Oneindia Telugu
     సీసీటీవీల్లో కామాంధుడి కర్మకాండ

    సీసీటీవీల్లో కామాంధుడి కర్మకాండ

    స్థానిక పోలీసు అధికారి అనీల్ సామానియా ఆసుపత్రికి చేరుకుని యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. డాక్టర్ తాఫిల్ మహమ్మద్ పీపీఇ కిట్లు, చేతులకు గ్లౌజ్ లు వేసుకుకోకుండా యువతి గదిలోకి వెళ్లాడని, మంగళవారం రాత్రి అతనికి ఢ్యూటీ లేదని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. వెంటనే హోటల్ లోని క్వారంటైన్ లో ఉన్న డాక్టర్ తాఫిల్ మహమ్మద్ ను పోలీసులు అరెస్టు చేశారు. కామాంధుడైన డాక్టర్ తాఫిల్ అహమ్మద్ ను ఆలీగఢ్ కోర్టు ముందు హాజరుపరిచారు. డాక్టర్ తాఫిల్ మహమ్మద్ విధులు లేకపోయినా ఎందుకు యువతి గదిలోకి వెళ్లాడు ?, సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన క్లిప్సింగ్స్ ఆధారంగా నివేదిక తయారు చేసి కోర్టులో సమర్పించాలని న్యాయమూర్తి రంజిత్ సింగ్ ఆలీగఢ్ దీనదయాల్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరెండెంట్ కు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద కామంతో రగిలిపోయి కరోనా పాజిటివ్ వచ్చిన యువతిని వదలకుండా ఆమెపై రెండుసార్లు అత్యాచారయత్నం చెయ్యడానికి ప్రయత్నించిన డాక్టర్ ప్రస్తుతం కటకటాలపాలైనాడు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+