వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: T అంటే ట్రంప్ కాదు, T అంటే ఠాక్రే, టైగర్, మాకే నీతులా ?, ఇంటింటి రామాయణం!

|
Google Oneindia TeluguNews

ముంబై/ న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలో దాదాపు 28 శాతం కరోనా పాజిటివ్ కేసులు ఒక్క మహారాష్ట్రలోనే నమోదైనాయి. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షలా 19 వేలకు పైగా పెరిగిపోయాయి. కరోనా కాటుకు మహాకాష్ట్రాలో 28, 734 మంది బలైనారు. ఇదే సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి.

ప్రతిపక్షాల విమర్శలను తిప్పకొడుతూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఘాటుగానే సమాధానం ఇచ్చారు. I am not Donald Trump, Iam Uddhav Thackeray, T అంటే ట్రంప్ కాదు T అంటే ఠాక్రే, టైగర్ అని గుర్తు పెట్టుకోవాలని ప్రతిపక్షాలపై ఉద్దవ్ ఠాక్రే విరుచుకుపడ్డారు.

Coronavirus: క్వారంటైన్ లో ప్రియుడితో లేడీ పోలీసు జల్సాలు, ప్రియుడి భార్య ఎంట్రీ, కిలాడీ ప్లాన్!Coronavirus: క్వారంటైన్ లో ప్రియుడితో లేడీ పోలీసు జల్సాలు, ప్రియుడి భార్య ఎంట్రీ, కిలాడీ ప్లాన్!

మహారాష్ట్ర పేరు చెబితే పరుగో పరుగు

మహారాష్ట్ర పేరు చెబితే పరుగో పరుగు

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. మహారాష్ట్రలో 3 లక్షలా 19 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ఇప్పటి వరకు 28, 734 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మహారాష్ట్రలో కరోనా కట్టడికి తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, త్వరలో పరిస్థితి అదుపులోకి వస్తుందని మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో పోలిక

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో పోలిక

అమెరికాలో కరోనా కాటుకు అమాయక ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా ఆదేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు చీమకుట్టినట్లు కూడా లేదని, ఎప్పుడు డబ్బు.. డబ్బు అంటూ ఆదాయం వచ్చే మార్గాల కోసం ఆలోచిస్తున్నారని, ప్రజల మీద ట్రంప్ కు మమకారం లేదని, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే కూడా ట్రంప్ లాగే ఆలోచిస్తున్నారని ప్రతిపక్ష నాయకలు విమర్శలు చేస్తున్నారు.

T అంటే ట్రంప్ కాదు... T అంటే ఠాక్రే

T అంటే ట్రంప్ కాదు... T అంటే ఠాక్రే

ప్రతిపక్ష నాయకుల ఆరోపణలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే స్పంధించారు. శివసేన అధికారిక పత్రిక సామ్నాకు ఇచ్చిన ఇంటర్వూలో (శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సీఎం ఉద్దవ్ ఠాక్రేని ఇంటర్వూ చేశారు) మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ప్రతిపక్ష నాయకులకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తాను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కాదని ఉద్దవ్ ఠాకే అన్నారు. T అంటే ట్రంప్ కాదు... T అంటే ఠాక్రే, టైగర్ అని గుర్తు పెట్టుకోవాలని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ప్రతిపక్ష పార్టీల నాయకులకు సూచించారు.

 ప్రజల ప్రాణాలు..... విద్యార్థులు ముఖ్యం

ప్రజల ప్రాణాలు..... విద్యార్థులు ముఖ్యం

మహారాష్ట్రలో పరిస్థితిని గమనించి కరోనా వైరస్ అదుపులోకి వచ్చిన తరువాత లాక్ డౌన్ నియమాలు సడలిస్తామని సీఎం ఉద్దవ్ ఠాక్రే అన్నారు. మాకు ప్రజల ప్రాణాలు ముఖ్యమని, ఆ విషయంలో ఎలాంటి రాజీ లేదని సీఎం ఉద్దవ్ ఠాక్రే గుర్తు చేశారు. విద్యాసంస్థలు ప్రారంభించడం, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించడంలో మా ప్రభుత్వం ఏ విషయంలోనూ రాజీపడదని, అన్ని ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటామని, మాకు మీరు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని సీఎం ఉద్దవ్ ఠాక్రే ప్రతిపక్ష నాయకులకు చెప్పారు.

ఇంటిపోరు తప్పలేదు

ఇంటిపోరు తప్పలేదు

కరోనా వైరస్ ను అరికట్టే విషయంలో మీకంటే మాకు అన్నివిషయాలు బాగా తెలుసని సీఎం ఉద్దవ్ ఠాక్రే ప్రతిపక్ష పార్టీల నాయకులు కౌంటర్ ఇచ్చారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ ను అరికట్టడంలో ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని ప్రతిరోజూ ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. చివరికి ఠాక్రేని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో పోల్చారు. అంతే కాకుండా మహారాష్ట్రలో శివసేనతో కలిసి అధికారంలో ఉన్న ఎన్ సీపీ నాయకులు సైతం సీఎం ఉద్దవ్ ఠాక్రే మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అధికారంలో ఉన్న మిత్రపక్ష పార్టీ నాయకులు సైతం విమర్శలు చెయ్యడంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే వారికి గట్టిగానే సమాధానం ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

English summary
Coronavirus: Maharashtra Chief Minister Uddhav Thackeray has recorded an interview for his Shiv Sena's mouthpiece "Saamna" with party MP and spokesperson Sanjay Raut. "I am not Donald Trump.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X