Lockdown: మే 31 కర్ఫ్యూ ఎత్తివేత, సండే సందడి, మటన్, మందు, చిందులు, నో రూల్స్, ఓకే !

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు దేశం మొత్తం లాక్ డౌన్ అమలులో ఉంది. లాక్ డౌన్ 4.0 అమలులో ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. లాక్ డౌన్ సడలింపులు అమలులోకి వచ్చిన తరువాత ప్రతి ఆదివారం కర్ణాటకలో కర్ఫ్యూ అమలు చేస్తూ వస్తున్నారు. అయితే లాక్ డౌన్ 4.0 మే 31వ తేదీ ఆదివారంతో పూర్తి అవుతోంది. ఈ సందర్బంగా బెంగళూరు ప్రజలతో పాటు కన్నడిగులకు కర్ణాటక ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మే 31వ తేదీ ఆదివారం కర్ఫ్యూ అమలులో ఉండదని, మద్యం, మటన్, చికెన్ షాపులతో పాటు ప్రభుత్వ ఆర్ టీసీ బస్సులు మొత్తం సంచరిస్తాయని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది.

 ప్రజల సంతోషం కోసం !

ప్రజల సంతోషం కోసం !

లాక్ డౌన్ సడలించినా ప్రతి ఆదివారం ఉదయం నుంచి అర్దరాత్రి వరకు బెంగళూరు నగరంతో పాటు కర్ణాటక మొత్తం కర్ఫ్యూ అమలు చేస్తామని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు ఆదివారాలు బెంగళూరుతో పాటు కర్ణాటకలో కర్ఫ్యూ అమలు చేశారు.

 ప్రజలు హ్యాపిగా ఉండాలని !

ప్రజలు హ్యాపిగా ఉండాలని !

మే 31వ తేదీ ఆదివారం ఎప్పటిలాగా అన్ని షాపులు తీసి ఉంటాయని, అన్ని వ్యాపారలావాదేవీలు నిర్వహించుకోవచ్చిని కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు తెలిపారు. బెంగళూరులో ప్రతిరోజు సంచరిస్తున్న బీఎంటీసీ (BMTC) సిటీ బస్సులు, కర్ణాటకలో కేఎస్ఆర్ టీసీ బస్సులు, ట్యాక్సీలు, ఆటోలు, క్యాబ్ లు సంచరిస్తాయని అధికారులు తెలిపారు.

 సండే సందడి

సండే సందడి

ఆదివారం అంటే సర్వసాధారణంగా దాదాపు అందరి ఇళ్లలో చికెన్, మటన్, చేపలతో పాటు మాంసాహారం చేస్తుంటారు. రెండు వారాల నుంచి ఆదివారం కర్ఫ్యూ అమలు కావడంతో మాంసాహార ప్రియులు ఆ రోజు చికెన్, మటన్, మందు ( లిక్కర్)కు దూరం అయ్యారు. అయితే ఈ ఆదివారం మందు, మటన్, చికెన్, చేపలతో పాటు అన్ని షాపులు తీసి ఉంటాయని అధికారులు తెలిపారు.

 అన్నీ ఓకే కానీ, ఇవి తప్పనిసరి

అన్నీ ఓకే కానీ, ఇవి తప్పనిసరి

మే 31వ తేదీ ఆదివారం కర్ఫ్యూ ఎత్తివేసినా ప్రజలు మాత్రం కొన్ని నియమాలు పాటించి బయట సంచరించాలని అధికారులు సూచించారు. ప్రతిఒక్కరూ ముఖానికి మాస్క్ వేసుకోవాలని, భౌతిక దూరం పాటించాలని, ఎక్కడపడితే అక్కడ గుంపులు గుంపులుగా నిలబడి పిచ్చపాటి మీటింగ్ లు పెట్టకూడదని అధికారులు సూచించారు. మొత్తం మీద లాక్ డౌన్ 4.0 చివరి రోజు అయిన మే 31వ తేదీ పూర్తిగా కర్ఫ్యూ ఎత్తివేయడంతో కర్ణాటకలోని కన్నడిగులు, ఇతర రాష్ట్రాల ప్రజలు ఖుషీఖుషీగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+