ఇండియాలో బయటపడ్డ ఆ కోవిడ్ వేరియంట్ 'డెల్టా'-డబ్ల్యూహెచ్ఓ నామకరణం
భారత్‌లో గుర్తించిన కోవిడ్ వేరియంట్స్‌కు డబ్ల్యూహెచ్ఓ పేర్లను సూచించింది. కోవిడ్ వేరియంట్ B.1.617.2ను 'డెల్టా' వేరియంట్‌గా,మరో వేరియంట్ B.1.617.1 'కప్పా' వేరియంట్‌గా వ్యవహరిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇతర కోవిడ్ వేరియంట్స్ B.1.351ని 'బీటా'గా, P.1ని 'గామా'గా వ్యవహరిస్తున్నట్లు తెలిపింది.ఈ మేరకు కోవిడ్ వేరియంట్ల పేర్లను సూచించే పట్టికను డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసింది.
గతంలో 'B.1.617.2' వేరియంట్‌ను ఇండియన్ పేరుతో లింక్ చేసి పిలవడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. డబ్ల్యూహెచ్ఓ ఎక్కడా దాన్ని అలా పేర్కొనలేదని కేంద్రం వెల్లడించింది. అలాంటి కంటెంట్ ఎక్కడైనా ఉంటే దాన్ని తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.తాజాగా డబ్ల్యూహెచ్ఓ వాటికి పేర్లు సూచించడంతో పేర్ల విషయంలో నెలకొన్న గందరగోళానికి తెరపడినట్లయింది.
B.1.617 వేరియంట్‌ను గతేడాది అక్టోబర్‌లో మొదటిసారిగా ఇండియాలో గుర్తించారు. ఇప్పటివరకూ 44 దేశాల్లో దీన్ని గుర్తించారు. అత్యంత వేగంగా ఈ వేరియంట్ వ్యాప్తి చెందుతోందని గతంలో డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.

ఆయా వేరియంట్స్‌కు ఇప్పుడున్న సైంటిఫిక్ పేర్లు కొనసాగుతాయని... తాజాగా సూచించిన పేర్లతో వాటిని భర్తీ చేయడం ఉండదని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. వేరియంట్స్‌ను గుర్తించే విషయంలో... వాటిని వెల్లడించే విషయంలో ప్రపంచ దేశాలు దాన్నేదో కళంకంలా భావించకూడదని డబ్ల్యూహెచ్ఓ పేర్కొనడం గమనార్హం.కోవిడ్ వేరియంట్లకు కొత్తగా సూచించిన పేర్ల విషయంలో విస్తృత స్థాయి సంప్రదింపులు,సమీక్ష తర్వాతే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసిన పట్టికలో ఇతర వేరియంట్స్‌ను పరిశీలిస్తే... B.1.427/B.1.429 వేరియంట్‌ను ఎప్సిలన్‌గా,P.2 వేరియంట్‌ను 'జీటా'గా,B.1.525 వేరియంట్‌ను 'ఈటా'గా,P.3 వేరియంట్‌ను థెటాగా,B.1.526 వేరియంట్‌ను లొటాగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. ఎప్సిలన్ వేరియంట్‌ను గతేడాది అమెరికాలో,గామా వేరియంట్‌ను గతేడాది నవంబర్‌లో బ్రెజిల్‌లో గుర్తించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications