Coronavirus: కూతురి పెళ్లితో ఊపిరి పీల్చుకున్న తండ్రి, 24 గంటల్లో ప్రాణం తీసిన కరోనా, క్వారంటైన్ లో!

బెంగళూరు/యాదగిరి: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) వ్యాధి తాండవం చేస్తోంది. కరోనా వైరస్ దెబ్బకు ఎప్పుడు ఎవరి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో చెప్పడం వైద్యులకే సాధ్యం కావడం లేదు. లాక్ డౌన్ సమయంలోనే అనుకున్న ముహూర్తానికి కుమార్తె పెళ్లి చేసిన తండ్రి హమ్మయ్యా నా భాద్యత తీరిపోయింది అని ఊపిరి పీల్చుకున్నాడు. కుమార్తె పెళ్లి జరిగి 24 గంటలు కాకముందే పెళ్లి కూతురి తండ్రి ప్రాణాలు కరోనా ఎత్తుకెళ్లింది. 24 గంటల తేడాలో పెళ్లి ఇంటి సంతోషంతో పాటు విషాదం నెనకొనింది. నవదంపతులతో సహ వారి కుటుంబ సభ్యులు, బంధువులు అందర్నీ ఇప్పుడు క్వారంటైన్ కు తరలించారు.

హ్యాపీగా కుమార్తె పెళ్లి

హ్యాపీగా కుమార్తె పెళ్లి

కర్ణాటకలోని రాయచూరు జిల్లా దేవదుర్గ తాలుకాలోని సిరవార గ్రామంలో 49 ఏళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కరోనా వైరస్ లాక్ డౌన్ సందర్బంగా ముందుగా అనుకున్న ముహూర్తానికి జూన్ 28వ తేదీన కుటుంబ సభ్యులు, అతి దగ్గర బంధువుల సమక్షంలో కుమార్తె వివాహం చాలా సంతోషంగా జరిపించాడు.

కూతురి పెళ్లితో ఊపిరిపీల్చుకుంటే !

కూతురి పెళ్లితో ఊపిరిపీల్చుకుంటే !

అనుకున్న ముహూర్తానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కుమార్తె పెళ్లి జరిగిపోవడంతో తండ్రి ఊపిరిపీల్చుకున్నాడు. జూన్ 28వ తేదీన రాత్రి పెళ్లి కుమార్తె, పెళ్లి కొడుకు శోభనం గదిలోకి వెళ్లారు. ఆ సమయంలో పెళ్లి కుమార్తె తండ్రి ఊపిరి ఆడక నానా ఇబ్బందులుపడ్డాడు. వెంటనే విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు ఆయన్ను రాయచూరు ఆసుపత్రికి తరలించారు.

పెళ్లి ఇంట్లో 24 గంటల్లో కరోనా చావు

పెళ్లి ఇంట్లో 24 గంటల్లో కరోనా చావు

కుమార్తె పెళ్లి జరిగిపోయిందని అనుకున్న పెళ్లి ఇంట్లో ఆ సంతోషం 24 గంటలు కూడా నిలువలేదు. శ్వాసకోస సమస్యతో ఆసుపత్రిలో చేరిన పెళ్లి కుమార్తె తండ్రి 24 గంటల్లోపే మరణించాడు. పెళ్లి కుమార్తె తండ్రికి వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయనకు కరోనా వైరస్ సోకిందని, అందుకే మరణించాడని వైద్యులు తెలిపారు.

ఫ్యామిలీ మొత్తం క్వారంటైన్

ఫ్యామిలీ మొత్తం క్వారంటైన్

పెళ్లి జరిగిన 24 గంటల్లోపే పెళ్లి కుమార్తె తండ్రి మరణించడంతో ఆ ఇంటిలో విషాదచాయలు నెలకొన్నాయి. పెళ్లి కుమార్తె తల్లి, ఆమె ఇద్దరు కుమార్తెలు, పెళ్లి కొడుకు, అతని కుటుంబ సభ్యులతో పాటు పెళ్లికి హాజరైన బంధువులు అందరిని అధికారులు క్వారంటైన్ కు తరలించారు. నవవదూవరులతో పాటు వారి కుటుంబ సభ్యులు అందరికీ కరోనా వైద్యపరీక్షలు నిర్వహించారు.

Recommended Video

    COVID-19 : నా పేరు మీనాక్షి, ఆమె కధ సీరియల్ నటి Navya Swamy కి Corona !
    సొంత పొలంలో ఏకాకిగా !

    సొంత పొలంలో ఏకాకిగా !

    పెళ్లి కుమార్తె తండ్రి మరణించడంతో ఆమె తల్లి, కుమార్తెలను క్వారంటైన్ కు తరలించారు. మృతుడి భార్య, కుమార్తెలు క్వారంటైన్ లో ఉండటంతో ఆయన బంధువులను సైతం అంత్యక్రియలకు దూరం పెట్టిన వైద్య శాఖ అధికారులు ఎవ్వరూ లేకుండా మృతుడి అంత్యక్రియలు నిర్వహించారు. మొత్తం మీద పెళ్లి జరిగిపోయిన 24 గంటల్లో పెళ్లి కుమార్తె తండ్రి మరణించడంతో నవవదూవరులతో పాటు అందర్నీ క్వారంటైన్ కు తరలించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+