Coronavirus: క్వారంటైన్ కామాంధులు, యువతి నగ్న వీడియో తీసి బ్లాక్ మెయిల్, దూలతీరింది !

భోపాల్: కరోనా (COVID 19) క్వారంటైన్ లో ఉంటున్న యువతి ఎప్పుడు ఎలాంటి చేదు వార్త వినాల్సివస్తుందో ? అనే ఆందోళనతో ఉంది. అలాంటి ఆందోళన సమయంలో యువతి బాత్ రూంలో స్నానం చేస్తుంటే ఇద్దరు యువకులు మొబైల్ లో వీడియోలు తీశారు. తరువాత మేము చెప్పినట్లు వినాలని, మా లైంగిక కోరికలు తీర్చాలని ఆ యువతిని బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలు పెట్టారు. కరోనా క్వారంటైన్ లో కామాంధులు రెచ్చిపోవడంతో మరింత ఆందోళనకు గురైన ఆ యువతి అధికారులకు అసలు విషయం చెప్పడంతో నిందితుల దూలతీర్చిన పోలీసులు బెండ్ ఎత్తేసి జైలుకు పంపించారు.

కరోనా క్వారంటైన్ లో యువతి !

కరోనా క్వారంటైన్ లో యువతి !

మధ్యప్రదేశ్ లోని దామోహ్ జిల్లాలో 24 ఏళ్ల యువతి నివాసం ఉంటున్నది. ఈమె ఇటీవల ఇండోర్ నుంచి సాగర్ జిల్లాకు వెళ్లింది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సంచరించిన వారి వివరాలు తెలుసుకున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారిని క్వారంటైన్ కేంద్రాలకు పంపిస్తున్నది. ఇదే సమయంలో ఆ యువతిని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.

యువతికి టెన్షన్ టెన్షన్

యువతికి టెన్షన్ టెన్షన్

ఇండోర్ నుంచి బుధ్ది లేకుండా తాను సాగర్ జిల్లాకు వచ్చి క్వారంటైన్ కేంద్రంలో చిక్కుకుపోయానని యువతి ఆవేదన చెందింది. ఎప్పుడు అధికారులు ఎలాంటి చేదు వార్త చెబుతారో ? ఎక్కడ తనకు కరోనా వైరస్ సోకుతుందో ? అనే భయంతో ఆ యువతి బిక్కుబిక్కుమంటూ గడిపింది.

యువతి స్నానం చేస్తుంటే వీడియో

యువతి స్నానం చేస్తుంటే వీడియో

ప్రభుత్వ పాఠశాలలోని ఆవరణంలో ఉన్న బాత్ రూంల్లో అక్కడ ఉంటున్న వారు స్నానాలు చేస్తున్నారు. బాత్ రూంలో ఎవరు లేరని తెలుసుకున్న ఆ యువతి స్నానం చెయ్యడానికి వెళ్లింది. ఆ సమయంలో అదే ప్రభుత్వ పాఠశాలలో క్వారంటైన్ లో ఉంటున్న ఇద్దరు యువకులు బాత్ రూం దగ్గరకు వెళ్లి యువతి స్నానం చేస్తుంటే ఆమె నగ్న వీడియోలు తీశారు.

Recommended Video

    Trump To Bring Back Drug Making To US From India And China
    లైంగిక కోరిక తీర్చాలని బ్లాక్ మెయిల్

    లైంగిక కోరిక తీర్చాలని బ్లాక్ మెయిల్

    క్వారంటైన్ లో ఉంటున్న ఇద్దరు కామంతో మరింత రెచ్చిపోయారు. తమకు కామవాంఛ తీర్చాలని, మేము చెప్పినట్లు వినాలని, లేదంటే నీ నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని యువతిని బ్లాక్ మెయిల్ చేశారు. అసలే క్వారంటైన్ లో టెన్షన్ తో ఉంటున్న యువతికి వీరి టార్చర్ ఎక్కువ కావడంతో తట్టుకోలేకపోయింది. వెంటనే సంబంధిత అధికారులకు యువతి ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరు కామాంధులకు బెండ్ తీసి జైలుకు పంపించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+