Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కరోనా నుంచి కోలుకున్న అమితాబ్ - ఇంకా ఆస్పత్రిలోనే అభిషేక్..

బచ్చన్ కుటుంబానికి చెందిన స్టార్లు ఒక్కొక్కరుగా కరోనా బారి నుంచి కోలుకుంటున్నారు. బాలీవుడ్‌ మెగాస్టార్‌, బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయనకు తాజా టెస్టుల్లో నెగటివ్ రావడంతో డాక్టర్లు ఇంటికి పంపారు. అయితే మరికొంత కాలం హోం క్వారంటైన్ లో మాత్రమే ఉండాలని సూచించారు. అమితాబ్ కోడలు ఐశ్వర్య రాయ్, మనవరాలు ఆరాధ్యకు కూడా కరోనా బారి నుంచి ఇటీవలే కోలుకున్నారు.

అమితాబ్‌, ఐశ్వర్య, ఆరాధ్యలు కరోనా వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, అభిషేక్‌ బచ్చన్‌ మాత్రం ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. తాజాగా జరిపిన పరీక్షల్లో అభిషేక్‌కు మరోసారి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆయన నానావతి ఆస్పత్రిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ''నాన్నకు నెగటివ్ వచ్చింది. ఇకపై ఆయన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటారు. దురదృష్టవశాత్తూ నా శరీరంలో ఇంకా కోవిడ్‌-19 అవశేషాలు ఉన్నాయి. ఇకొన్ని రోజులు చికిత్స తప్పేలాలేదు. మా ఫ్యామిలీ కోసం ప్రార్థించిన అందరికీ థ్యాంక్స్'' అని అభిషేక్ ట్వీట్ చేశారు.

 covid-19: Amitabh Bachchan discharged, Abhishek still at hospital

దేశ సినీ, ఆర్థిక రంగాలకు రాజధానిగా ఉన్న ముంబై తొలి నుంచీ కరోనా హాట్ స్పాట్ జోన్ గా కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా 17 లక్షల పైచిలుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే, అందులో 4.31లక్షల కేసులు మహారాష్ట్ర నుంచి రావడం గమనార్హం. అత్యధికంగా 15,316 మంది చనిపోయింది కూడా ఆ రాష్ట్రంలోనే. 2.66 మంది రికవరీ కాగా, యాక్టిక్ వేసుల సంఖ్య 1.5లక్షలుగా ఉందక్కడ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+