భారత్‌లో కరోనా: మళ్లీ విజృంభణ -కొత్తగా 16,752 కేసులు, 113 మరణాలు -యాక్టివ్‌ కలకలం

కరోనా మహమ్మారి పట్ల అంతటా నెలకొన్న నిర్లక్ష్యం భారీ మూల్యానికి దారితీస్తోందా? దేశంలో మళ్లీ వైరస్ విజృంభణ తప్పదా? అంటే అవుననే గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన 4 రోజుల్లో కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం, యాక్టివ్ కేసుల సంఖ్య మళ్లీ పేరుకుపోతుండటం కలవరం పుట్టిస్తున్నది. వివరాల్లోకి వెళితే..

దేశంలో వరుసగా నాలుగోరోజు కొత్త కేసుల సంఖ్య 16వేలకు పైగా నమోదయ్యాయి. అంతకు ముందు రోజుతో పోలిస్తే కేసులు స్వల్పంగా పెరిగాయి. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం వెల్లడించిన లెక్కల ప్రకారం.. దేశంలో గడిచిన 24 గంటల్లో 7.95 లక్షల టెస్టులు చేయగా, కొత్తగా 16,752 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,96,731కి పెరిగింది..

 covid-19: India records 16,752 new cases, 113 deaths in last 24 hrs, active cases increased

నిన్న ఒక్కరోజే కొవిడ్ మహమ్మారి కాటుకు 113 మంది బలైపోయారు. దేశంలో మరణాల రేటు 1.42 శాతంగా కొనసాగుతోంది. మొత్తం మరణాల సంఖ్య 1,57,051కి పెరిగింది. శనివారం నాడు 11,718 మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,07,75,169కు చేరింది. దేశంలో రికవరీ రేటు 97.10శాతంగా ఉంది. అయితే..

గడిచిన 4 రోజులుగా రికవరీల కంటే కొత్త కేసుల సంఖ్య ఎక్కువగా వస్తుండటంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 1,64,511గా ఉంది. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ సజావుగా సాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం టీకా అందిన వారి సంఖ్య 1,43,01,266కి చేరింది. ప్రైవేట్ హాస్పిటళ్లలో కరోనా వ్యాక్సిన్ ధరను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాక్సిన్ ఒక్కో డోసును 250 రుపాయలకు అందించాలని శనివారం కేంద్రం అధికారికంగా ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+