వ్యాక్సినేషన్‌పై కేంద్రం క్లారిటీ- కోవిన్ యాప్ లేదు, కోవిన్ పోర్టల్‌లోనే రిజిస్ట్రేషన్లు
ఇవాళ దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ రెండో దశ ప్రారంభమైంది. ఇందులో 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు, అలాగే 45 ఏళ్లు దాటిన తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా వ్యాక్సిన్ కోసం పేర్లు నమోదు చేసుకుంటే టీకాలు వేస్తున్నారు. దీంతో గతంలో కేంద్రం విడుదల చేసిన కోవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ల కోసం జనం ఎగబడుతున్నారు. కానీ ఇప్పుడు ఆ యాప్‌ను రిజిస్ట్రేషన్లకు వాడటం లేదని కేంద్రం చావు కబురు చల్లగా చెప్పింది.
రెండో విడత వ్యాక్సినేషన్‌లో కోవిన్ యాప్ లేదని కేవలం కోవిన్ పోర్టల్‌లోనే కరోనా వ్యాక్సినేషన్ కోసం పేర్లు నమోదు చేసుకోవాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపింది. కోవిన్ యాప్‌ను కేవలం అడ్మినిస్ట్ర్టేటర్ల కోసం వాడుతున్నట్లు కేంద్రం తెలిపింది. మిగతా వారంతా కోవిన్ డాట్ జీవోవీ డాట్ ఆర్గ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి పేర్లు నమోదు చేసుకోవాలని ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. వివిధ వర్గాల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆరోగ్యశాఖ ఈ మేరకు క్లారిటీ ఇచ్చింది.

మార్చి 1వ తేదీ నుంచి కోవిన్ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని ఆరోగ్యమంత్రిత్వశాఖ సూచించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ స్లాట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. పేర్లు నమోదు చేసుకున్న వారికి వ్యాక్సిన్ డోసుల అందుబాటును దృష్టిలో ఉంచుకుని టీకాలు వేస్తామని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండు వ్యాక్సిన్లు కోవిషీల్డ్, కోవాగ్జిన్‌లో ఒకదానిని ఎంచుకునేందుకు కూడా కరోనా బాధితులకు అవకాశం లేదని, ప్రభుత్వం తమ పరిమితుల మేరకు దీన్ని సరఫరా చేస్తోందని తెలిపింది. ప్రభుత్వ ఆరోగ్యకేంద్రాలు, ఆస్పత్రుల్లో దీన్ని ఉచితంగా వేస్తారని, ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రం రూ.250కే దీన్ని అందుబాటులో ఉంచినట్లు కేంద్రం తెలిపింది.
-
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!












Click it and Unblock the Notifications