వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిడ్ థర్డ్ వేవ్: భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎప్పుడు పీక్ కు చేరుకుంటుంది? శాస్త్రవేత్తల అంచనా ఇదే

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కోవిడ్ 3వ వేవ్ విజృంభిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా విపరీతంగా కేసులు నమోదు అవుతున్నాయి. నిపుణుల విశ్లేషణ ప్రకారం, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా ఇప్పటికే గరిష్ట స్థాయిని చూడగా, బెంగళూరు జనవరి 22న గరిష్ట స్థాయిని చూస్తుంది. రోజువారీ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నా ఆస్పత్రిలో చేరికలు తక్కువగా నమోదు అవుతున్నాయి.

Recommended Video

Omicron Variant : Covid ‘Tsunami’ - WHO | Oneindia Telugu

అంతమాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కాదని, కరోనా పరిణామం ఎప్పుడు ఎలా జరుగుతుందో అర్ధం కావటం లేదని నిపుణులు చెప్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రజలు సామాజిక దూరం పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని చెప్తున్నారు.

జనవరి 23 వరకు మూడవ వేవ్ యొక్క మొత్తం గరిష్ట స్థాయి

జనవరి 23 వరకు మూడవ వేవ్ యొక్క మొత్తం గరిష్ట స్థాయి

శాస్త్రవేత్తలు కోవిడ్ -19 పరిస్థితి యొక్క తాజా విశ్లేషణ ప్రకారం భారతదేశంలో మూడవ వేవ్ యొక్క మొత్తం గరిష్ట స్థాయి జనవరి 23 న చేరుకుంటుందని చెబుతున్నారు. అయితే రోజువారీ కేసులు 4 లక్షలు దాటే అవకాశం లేదని చెబుతున్నారు . జనవరి రెండవ వారంలో ఢిల్లీ, ముంబై ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకున్నాయని కోవిడ్ ట్రాకర్ సూత్ర మోడల్ తెలిపింది.ఏది ఏమైనా తాజా పరిస్థితులలో దేశ వ్యాప్తంగా ఆందోళన కొనసాగుతుంది.

సూత్ర కన్సార్టియం లెక్కలు చెప్తుందిదే

సూత్ర కన్సార్టియం లెక్కలు చెప్తుందిదే

మహమ్మారి ప్రారంభం నుండి కోవిడ్ సంఖ్యలతో పని చేస్తున్న సూత్ర కన్సార్టియం పరిశోధకులలో ఒకరైన ఐఐటి ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ మాట్లాడుతూ కొనసాగుతున్న మూడవ వేవ్ యొక్క శిఖరాన్ని రాష్ట్ర వారీగా చిత్రీకరిస్తూ, జనవరి 12న ముంబై గరిష్ట స్థాయికి చేరుకుందని మరియు ఇప్పుడు సంఖ్యలు వేగంగా తగ్గుతున్నాయని మోడల్ వెల్లడించింది.ఢిల్లీ జనవరి 16న, కోల్‌కతా జనవరి 13న గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. బెంగళూరు జనవరి 22న గరిష్ట స్థాయికి చేరుకుంటుంది.

వివిధ రాష్ట్రాలు మరియు నగరాల్లో కోవిడ్ 3వ వేవ్ పీక్ పై ఐఐటి ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్

వివిధ రాష్ట్రాలు మరియు నగరాల్లో కోవిడ్ 3వ వేవ్ పీక్ పై ఐఐటి ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్

సూత్ర కన్సార్టియం ప్రకారం, మహారాష్ట్ర, గుజరాత్ మరియు యూపీ జనవరి 19న, అస్సాం జనవరి 26న గరిష్ట స్థాయికి చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం హాస్పిటలైజేషన్‌లు చాలా తక్కువగా కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 1% కంటే తక్కువ కేసులు నమోదయ్యాయని ప్రొఫెసర్ అగర్వాల్ పేర్కొన్నారు.భారతదేశంలో మంగళవారం 2.38 లక్షల కేసులు నమోదయ్యాయి. దేశంలో రోజువారీ కేసుల పెరుగుదల కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాలు మరియు నగరాల్లో కోవిడ్ 3వ వేవ్ పీక్ ఎప్పటి వరకు చేరుకుంటుందో ఆయన చెప్పారు.

కోవిడ్ డేటా ఆధారంగా లెక్కించిన సూత్ర కన్సార్టియం ద్వారా వేసిన లెక్కల అంచనా

కోవిడ్ డేటా ఆధారంగా లెక్కించిన సూత్ర కన్సార్టియం ద్వారా వేసిన లెక్కల అంచనా

అస్సాం: జనవరి 26,
బీహార్: జనవరి 17
ఉత్తరప్రదేశ్: జనవరి 19
హర్యానా: జనవరి 20
గుజరాత్: జనవరి 19
మహారాష్ట్ర: జనవరి 19
కర్ణాటక: జనవరి 23
ఆంధ్రప్రదేశ్: జనవరి 30
తమిళనాడు: జనవరి 25
బెంగళూరు: జనవరి 22
కోల్‌కతా: జనవరి 13
ఢిల్లీ: జనవరి 16
ముంబై: జనవరి 12.
ఇది కోవిడ్ డేటా ఆధారంగా లెక్కించిన సూత్ర కన్సార్టియం ద్వారా గణిత శాస్త్ర ప్రొజెక్షన్ అని ఆయన వెల్లడించారు. క్షేత్రస్థాయిలో కోవిడ్ పరిస్థితి పరిణామం చెందుతోందని ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ వెల్లడించారు .

English summary
Covid 3rd wave is booming in India. Extreme cases are already being reported across the country. According to analysts, Delhi, Mumbai and Kolkata have already seen highs, while Bangalore will see peaks on January 22.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X