భారతీయుడు 2 సినిమా షూటింగ్‌లో ఘోర ప్రమాదం: ముగ్గురు మృతి, శంకర్‌కు గాయాలు, కమల్ కన్నీరు..
Recommended Video
చెన్నై: ప్రముఖ సినీనటుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు-2(ఇండియన్ 2) చిత్ర షూటింగ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. షూటింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ క్రేన్ విరిగిపడటంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

ముగ్గురు మృతి, మరో పది మందికి గాయాలు
బుధవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో 10 మందికి తీవ్రంగా గాయపడ్డారు. చెన్నై సమీపంలోని పూందమల్లి వద్ద గల ఈవీపీ స్టూడియోలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి, వైద్యం అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దర్శకుడు శంకర్‌కు గాయాలు.. కమల్ కన్నీరు..
కాగా, భారతీయుడు-2ను రూపొందిస్తున్న ప్రముఖ శంకర్‌కు కూడా ఈ ప్రమాదంలో గాయపడినట్లు సమాచారం. ఆయనను కూడా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన ప్రాణానికి ఏం ప్రమాదం లేనట్లేనని తెలిసింది. ఘటనా స్థలంలో కమల్ హాసన్ సహాయక చర్యల్లో స్వయంగా పాల్గొన్నారు.తన సినిమా షూటింగ్‌లో ఈ ఘటన జరగడం పట్ల కమల్ కన్నీటిపర్యంతమయ్యారు.

తమిళ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి..
సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, ఘటన సమాచారం తమిళ సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. పలువురు సినీప్రముఖులు ఘటనా స్థలానికి చేరుకుంటుుండగా, మరికొందరు ఏం జరిగిందనే విషయాన్నిఫోన్ల ద్వారా తెలుసుకుంటున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఫోన్ చేసి ఘటనపై తెలుసుకున్నట్లు సమాచారం.

ప్రతిష్టాత్మకంగా భారతీయుడు2
శంకర్ ప్రతిష్టాత్మకంగా భారతీయుడు2ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కమల్ హాసన్ తోపాటు సిద్దార్థ, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్‌సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం పలు భాషల్లో విడుదల చేయనున్నారు. కాగా, భారతీయుడు చిత్రం శంకర్-కమల్ హాసన్ కాంబినేషనల్‌లో వచ్చి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా, చిత్రబృందం ఈ ఘటనపై స్పందించాల్సి ఉంది.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications