Viral CV: వైరల్‌గా మారిన వంటమనిషి CV.. సింగిల్ పోస్ట్‌తో కుక్‌ ఫేమస్

CV for Cook: ఇండియన్ సిలికాన్ వ్యాలీగా, ఎలక్ట్రానిక్ సిటీగా బెంగళూరు ఎంతో ప్రఖ్యాతి గాంచింది. దేశం గర్వించదగ్గ ఎన్నో రకాల స్టార్టప్స్‌ ఇక్కడే ప్రాణం పోసుకున్నాయి. టెక్నాలజీ వినియోగంలో నగరవాసులు ముందంజలో ఉంటారు. ఓ వ్యక్తి క్రియేటివ్‌ కోణంలో ఆలోచించి చేసిన పని నెట్టింట ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఇలా కూడా చేయవచ్చా అని పలువురిని ఆలోచింపచేస్తోంది.

ఉర్వి అనే ఓ సోషల్ మీడియా వినియోగదారు X ప్లాట్‌ఫారమ్‌లో షేర్ చేసిన ఓ పోస్ట్‌కి ఊహించని రిప్లై వచ్చింది. అదికాస్తా ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. HSR ప్రాంతంలో సింపుల్ హోమ్‌లీ ఫుడ్‌ తయారు చేయగల కుక్ కోసం సిఫార్సు చేయాలని ఆమె కోరారు. దయచేసి లీడ్స్ ఉంటే తెలియచేయాలని అభ్యర్థించారు.వరుణ్ పెరూ అనే వ్యక్తి నుంచి వచ్చిన సమాధానం ఆమెతో పాటు సోషల్ మీడియా యూజర్లను ఆశ్చర్యానికి గురిచేసింది.

CV for cook went viral in social media

దీనిపై బెంగళూరు నివాసి వరుణ్ పెరూ స్పందించారు. తన వంటమనిషి రీతు CVని ఉర్వికి షేర్ చేశారు. ఆమెను కుక్ ఉద్యోగం కోసం పరిగణించమని కోరారు. 'మీరు ఖచ్చితంగా HSR మాస్టర్‌చెఫ్‌ రీతు దీదీని పరిగణించాలి. ఇంటి భోజనం తయారీలో ఆమె పని అద్భుతంగా ఉంది. నేను ఆమె కోసం రెజ్యూమ్‌ని కూడా తయారు చేసాను. ఎందుకంటే ఆమె ఈ పనికి అర్హురాలు' అని రెజ్యూమ్‌తో సహా ఉర్వి పోస్ట్‌కి రిప్లై ఇచ్చారు.

ఇందులో రీతూ నైపుణ్యాలు, వాటి వివరాలతో పాటు ఆమె చిత్రం కూడా ఉంది. రాజ్మా-చావల్ మరియు రసం రైస్ వంటి ఆహారాన్ని వండటంలో ఆమె నిపుణురాలని CVలో పేర్కొన్నారు. వంటగదిని పరిశుభ్రంగా, చక్కగా ఉంచుతుందని రాశారు. గ్యాస్ మరియు ఇండక్షన్ ఉపయోగించి వంట చేయడంలో ఆమెది అందెవేసిన చేయి అని వివరించారు. ఏ విధమైన వంటగదికైనా అమె ఇట్టే సరిపోతుందని తెలిపారు.

వంటమనిషి కోసం CV తయారుచేయడం ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించింది. కుక్ కోసం తయారు చేసిన రెజ్యూమ్ ఇలా వైరల్ అవుతుందని ఊహించలేదంటూ, వరుణ్ సృజనాత్మకతపై సోషల్ మీడియాలో వినియోగదారులు ప్రశంసలు కురిపించారు. మన ఇంటిలో సహాయం చేస్తున్న వ్యక్తిపై చూపించాల్సిన గౌరవం ఇదేనని కామెంట్స్ చేశారు. ఆమె ఈ తరహా ప్రశంసలకు నిజమైన అర్హురాలని కొనియాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+