దేశ భక్తి పేరుతో సైబర్ మోసాలు ..అభినందన్ పేరుతో ఫేక్ అకౌంట్లు, స్పందించిన ఐఏఎఫ్
సైబర్ నేరగాళ్లు దేశభక్తిని వాడుకుంటున్నారు. తాజాగా భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్ గా ఉన్న అభినందన్ పాక్ చెరలో బందీ గా ఉన్న సమయంలోనూ ఆయన చూపించిన ధైర్యసాహసాలు భారతదేశ ప్రజల గౌరవానికి కారణమయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా పాక్ చెర నుండి భారత్ కి చేరిన యుద్ధవీరుడు అభినందన్ కు భారత ప్రజలు జయజయ ధ్వానాలు పలికారు. భారతీయుల దేశభక్తిని కూడా కొందరు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. దీంతో నిఘా వర్గాలు ఈ అకౌంట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నాయి.
అభినందన్ పేరుతో సోషల్ మీడియాలో ఇబ్బడిముబ్బడిగా అకౌంట్ లు క్రియేట్ చేశారు . సర్జికల్ స్ట్రైక్ తర్వాత జరిగిన పరిణామాలతో అభినందన్ మీద దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. సోషల్ మీడియాలో అభినందన్ తో టచ్ లో ఉండాలని భావించిన భారతీయులు ఈ అకౌంట్లోకి లాగిన్ అవుతున్నారు. దీంతో సదరు నెటిజన్ల అకౌంట్లు హ్యాక్ కు గురవుతున్నాయి. అభినందన్ పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయడం ద్వారా కొందరు సైబర్ నేరగాళ్లు పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని కొల్లగొడుతున్నారని ఇంటలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే సైబర్ నేరగాళ్లు సేకరిస్తున్న పౌరుల సమాచారాన్ని దేశద్రోహానికి కూడా వాడే అవకాశాలున్నాయని అనుమానిస్తున్నారు.

దీంతో అప్రమత్తమైన భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ కు సోషల్ మీడియాలో ఎలాంటి అకౌంట్లు లేవని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది. సోషల్ మీడియా యూజర్లు ఎవరూ అభినందన్ పేరుతో ఉన్న అకౌంట్లను ఫాలో కావొద్దని సూచించింది. ఆయన పేరుతో ఉన్నవన్నీ ఫేక్ అకౌంట్లేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు అభినందన్ పేరుతో ఉన్న కొన్ని ఫేక్ అకౌంట్లను ఐఏఎఫ్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. అభినందన్ పేరుతో ఫేక్ అకౌంట్లు తెరిచి అసత్యప్రచారం చేస్తుండడంతో పాటు సదరు అకౌంట్ ల దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉన్న కారణంగా ఐఏఎఫ్ చర్యలు చేపట్టింది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications