Cyclone Amphan: బెంగాల్, ఒడిశాలో బీభత్సం, 84 మంది మృతి, వేలాది ఇళ్లు ధ్వంసం
కోల్‌కతా/ఒడిశా: ఆంపన్ పెను తుఫాను పశ్చిమబెంగాల్, ఒడిశాల్లో బీభత్సం సృష్టించింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఈ తుఫాను భారీ, ఆస్తి ప్రాణ నష్టాన్ని కలిగించింది. బెంగాల్, ఒడిశాతోపాటు బంగ్లాదేశ్‌నూ అతలాకుతలం చేసింది. భారీ వర్షాలు, ఈదురు గాలులకు 84 మంది మృతి చెందగా, వందలాది మంది గాయాలపాలయ్యారు.

బెంగాల్‌లోనే 72 మంది మృతి
తుఫాను కారణంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోనే 72 మంది మృతి చెందారని సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. వీరిలో 15 మంది కోల్‌కతాకు చెందినవారే ఉన్నారని తెలిపారు. దాదాపు పదేళ్ల తర్వాత బెంగాల్ రాష్ట్రం మరోసారి భారీ తుఫానును ఎదుర్కొందని చెప్పారు. తుఫాను కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

భారీ నష్టం.. మమత పరిహారం..
తుఫాను కారణంగా మృతి చెందిన బాధితుల కుటుంబసభ్యులకు రూ. 2 లక్షల నుంచి 2.50లక్షల వరకు పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీని సుందర్భన్స్ ప్రాంతంలో పర్యటించాలని ఆమె కోరారు. భారీ నష్టపోయిన రాష్ట్రానికి సాయం అందించాలని విన్నవించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనతో మాట్లాడారని ఆమె తెలిపారు.
Recommended Video

వేల సంఖ్యలో ఇళ్లు ధ్వంసం
కాగా, ఆంఫన్ తుఫాను సృష్టించిన బీభత్సానికి తీర ప్రాంత గ్రామాలతోపాటు కోల్‌కతా నగరంలో భారీ ఆస్తి నష్టం సంభవించింది. వేల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమవడంతో అనేక మంది నిరాశ్రయులయ్యారు. పెద్ద సంఖ్యలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఒడిశాలో భారీ మొత్తంలో పంటలు దెబ్బతిన్నాయి. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
ఆదుకుంటామని మోడీ హామీ
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలను చేపట్టారు. కాగా, ప్రధాని మోడీ తుఫాను సృష్టించిన బీభత్సంపై విచారం వ్యక్తం చేశారు. బెంగాల్ రాష్ట్రానికి అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. మమతతోపాటు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కు ఫోన్ చేసిన అమిత్ షా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాగా, ఈ తుఫాను బంగ్లాదేశ్‌లోనూ బీభత్సం సృష్టించింది. 10 మందికిపైగా మృతి చెందారు. భారీ ఆస్తి నష్టం జరిగింది.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications