రేపు మచిలీపట్నం వద్ద హెలెన్ తీరం దాటే అవకాశం

హెలెన్ తుఫాను పైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్షలు జరుపుతున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్సు నిర్వహించాలని ఆదేశించారు.
హెలెన్ ప్రభావం వల్ల గురువారం దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
కాకినాడ, గంగవరం, విశాఖ, కళింగపట్నం, భీముని పట్నం ఓడరేవుల్లో మూడో ప్రమాద హెచ్చరిక, కృష్ణపట్నం ఓడ రేవులో ఐదో ప్రమాద హెచ్చరిక, మచిలీపట్నం, నిజాంపట్నం ఓడ రేవులలో ఆరో నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఎవరూ వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అలలు ఎగిసిపడుతున్నాయి.












Click it and Unblock the Notifications