ఢిల్లీ అంటే కరాచీ! మోడీ అంటే.. : దావూద్ గ్యాంగ్ కోడ్ భాష వెల్లడించిన సోదరుడు కస్కర్

ఇటీవల పోలీసులకు పట్టుబడ్డ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ విచారణలో పలు కీలక విషయాలను వెల్లడించాడు.

ముంబై: ఇటీవల పోలీసులకు పట్టుబడ్డ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ విచారణలో పలు కీలక విషయాలను వెల్లడించాడు. దావూద్ గ్యాంగ్ తమ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు కోడ్ భాషను ఉపయోగించినట్లు తెలిపాడు. 'మోడీ అంటే ఛోటాషకీల్‌... ఢిల్లీ అంటే కరాచీ' అని ఇలాంటి కోడ్ భాషను ఉపయోగించినట్లు తెలిపాడు.

ఇక్బాల్‌ కస్కర్‌ను ఇటీవల థానే పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విచారణ సమయంలో కస్కర్‌ దావూద్‌ గురించిన కీలక సమాచారాన్ని వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. దావూద్‌ ఇంకా పాకిస్థాన్‌లోనే ఉన్నాడని.. కరాచీలో ఆయన ఉంటున్న వివరాలను కూడా కస్కర్‌ తెలిపాడు.

D Company's Code Words Revealed; 'Modi' For Chhota Shakeel And 'Delhi' For Karachi

అంతేగాక, నేరాలు చేసేప్పుడు దావూద్‌ డి కంపెనీ వాడే కోడ్‌ పదాలను కూడా కస్కర్‌ వెల్లడించాడు. ఛోటా షకీల్‌ అనే పేరును చెప్పాల్సి వచ్చినప్పుడు మోడీ అని.. కరాచీని ఢిల్లీ అని పలికేవారట.

బడే అంటే దావూద్‌, దడ్బా అంటే పోలీస్‌ వ్యాన్‌ అని కోడ్‌ పదాలు ఉపయోగించేవారట. ఏక్‌ పేటీ పదాన్ని రూ.లక్షకు కోడ్‌గా, రూ.కోటికి ఏక్‌ బాక్స్‌ అని మాట్లాడేవారని కస్కర్‌ పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. వీటన్నింటినీనేరాలు చేసే సమయంలో దావూద్‌ అనుచరులు ఉపయోగించేవారని కస్కర్‌ పేర్కొన్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+