వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఔరంగజేబు పోస్టర్లతో డ్యాన్స్ లు, ఊరేగింపులు, దెబ్బకు ఢమాల్, క్లైమాక్స్ లో సీన్ రివర్స్, వైరల్ వీడియోతో?

|
Google Oneindia TeluguNews

ముంబాయి/ఔరంగాబాద్: మరోసారి హిందూ, ముస్లీం మతాలకు చెందిన చక్రవర్తులు, రాజులు, నాయకుల వివాదం తెరమీదకు వచ్చింది, దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా కర్ణాటకలో టిప్పు సుల్తాన్ వ్యవహారంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు నిత్యం పోట్లాడుకుంటున్నాయి. ఇప్పుడు వివాదాస్పద చక్రవర్తిగా గుర్తింపు తెచ్చుకున్న ఔరంగజోబు గురించి వ్యవహారం ముదిరిపోయింది.

ఔరంగజోబు ఫోటోలతో డ్యాన్స్ లు చేసి నానా గంగామా చేసి మతఘర్షణలు జరగడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ పోలీసులు కేసులు నమోదు చేశారు, ఔరంగజోబు ఫోటోలు జోబులో పెట్టుకోకుండా ఆయన ఫోటోలు పైకి ఎత్తి పెట్టుకుని డ్యాన్స్ లు చేసి వివాదానికి కారణం అయిన వారి మీద పోలీసులు కేసులు నమోదు చేశారు.

Wife: రెండో భార్యతో రొమాన్స్, అర్దరాత్రి మద్యం మత్తులో మర్మాంగానికి బదులుగా ?Wife: రెండో భార్యతో రొమాన్స్, అర్దరాత్రి మద్యం మత్తులో మర్మాంగానికి బదులుగా ?

మ్యాటర్ రివర్స్

మహారాష్ట్రలో మొఘల్ మహారాజు, ఆలనాటి చక్రవర్తి ఔరంగజేబు పోస్టర్‌తో డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఔరంగజేబు పోస్టర్లు, ఫోటోలతో డ్యాన్స్ లు చేసిన 8 మంది మీద పోలీసులు కేసు నమోదు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పోస్టర్లతో కొందరు డ్యాన్స్ లు చేస్తున్న వీడియో క్లిప్స్ ఆదివారం రాత్రి నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు వైరల్ అయిన తరువాత మహారాష్ట్ర పోలీసులు వాషిమ్ జిల్లాలో 8 మందిపై కేసు నమోదు చెయ్యడం కలకలం రేపింది.

జనవరి 1వ తేదీన స్కెచ్ వేశారు.... అయితే ఇప్పుడు?

జనవరి 1వ తేదీన స్కెచ్ వేశారు.... అయితే ఇప్పుడు?

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నుండి సుమారు 200 కిలో మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. జనవరి 1న ఉర్స్ ఆఫ్ దాదా హయత్ ఖలందర్ సందర్భంగా కొందరు యువకులు ఔరంగజేబు పోస్టర్లు పైకి ఎత్తుకుని డ్యాన్స్ లు చేశారని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే కొందరి మీద కేసులు నమోదు చేశామని పోలీసు అధికారులు అంటున్నారు. మొఘల్ సామ్రాంజ్యం పాలకుల పోస్టర్‌లను పట్టుకుని పెద్ద సంఖ్యలో ప్రజలు పాటలు పాడుతూ డ్యాన్స్ లు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయ్యాయి. మహారాష్ట్రలోని వాషిమ్‌లోని మంగ్రుల్‌పిర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసు అధికారులు అంటున్నారు.

ఊరేగింపులో ఏం జరిగింది?

ఊరేగింపులో ఏం జరిగింది?

జనవరి 1వ తేదీన దాదా హయత్ ఖలందర్ ఉరుస్ సందర్భంగా ఓ వర్గంలోని కొంతమంది యువకులు ఔరంగజేబు ఫోటోలు పట్టుకుని నినాదాలు చేశారని, ఊరేగింపులో డ్యాన్స్ లు చేశారని కేసు నమోదు అయ్యిందని మంగ్రుల్పిర్ ఇన్స్పెక్టర్ సునీల్ హుడ్ ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐకి తెలిపారు. ఇంకా ఈ విషయంలో తదుపరి విచారణ కొనసాగుతోందని, అరెస్టు అయిన వారు అందరూ వాషిమ్‌ ప్రాంతానికి చెందిన వారే అని మహారాష్ట్ర పోలీసులు అంటున్నారు.

సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు?

సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు?

ఔరంగజేబు ఫోటోలతో డ్యాన్స్ చేసిన నిందితుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంస్థ నిరసన వ్యక్తం చేసింది. అలాగే ఈ సంస్థ ఔరంగజేబు దిష్టిబొమ్మలను దహనం చేసిన సంగతి తెలిసిందే. ఔరంగజేబ్ ఫోటోలతో కొంతమంది వ్యక్తులు డ్యాన్స్ లు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని, ఇది సమాజంలో చెడు సందేశాన్ని ప్రచారం చేసినట్లు అవుతుందని ఓ హిందూ సంస్థ నిరసన వ్యక్తం చేసింది.

దానికి, దీనికి తేడా ఏముంది?

దానికి, దీనికి తేడా ఏముంది?

ఇటీవల అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ తన పుట్టినరోజును మహారాష్ట్రలోని మలాడ్‌లో జరుపుకున్నాడు. ఈ ఘటనపై ముంబై పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఛోటా రాజన్ పుట్టినరోజు వేడుకల పేరుతో నిందితులు డబ్బులు వసూలు చేస్తున్నారని, అతడిని సన్మానించేందుకు కబడ్డీతో పాటు వివిద క్రీడా కార్యక్రమాలు నిర్వహించారని ఆరోపణలు ఉన్నాయి. మఫియా డాన్ ఛోటా రాజన్ కు, ఔరంగజేబుకు పెద్ద తేడా లేదని, ఇద్దరు ఒక్కటే అని మహారాష్ట్రలోని హిందూ సంఘ మండిపడుతున్నాయి.

English summary
Dances, processions with posters of Emperor Aurangzeb, police registered cases in Maharashtra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X